జాతీయ వార్తలు

మనోళ్లను వెనక్కి రప్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 11: కరోనా వైరస్ కుదిపేస్తున్న ఇటలీ, ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని రాజ్యసభలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. అయితే ఆ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించడానికి ముందుగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి, వైరస్ లేదని నిర్ధారించుకుంటామన్నారు. బుధవారం రాజ్యసభలో కేంద్ర మంత్రి జైశంకర్ స్వతహాగా ఒక ప్రకటన చేస్తూ గురువారం ఓ వైద్య బృందం ఇటలీకి బయలుదేరనున్నట్లు చెప్పారు. ఇటలీ, ఇరాన్‌లో కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. ఆ దేశాల్లో ఉన్న మన దేశ పౌరులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వెనక్కి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ఆ దేశ ప్రజలు వైరస్‌తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ వైరస్ సుమారు 90 దేశాలకు విస్తరించలేదన్నారు. ఈ రెండు దేశాల్లోని భారతీయులనే కాదు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న భారతీయులనైనా వెనక్కి రప్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో 6 వేల మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 1,100 మంది పర్యాటకులు ఉన్నారని చెప్పారు. ఈ పర్యాటకులు కేంద్ర పాలిత ప్రాంతాలైన లడక్, జమ్మూ-కాశ్మీర్, మహారాష్టక్రు చెందిన వారని ఆయన వివరించారు. ఇరాన్ నుంచి 58 మంది భారత పర్యాటకులు ఇటీవల వెనక్కి వచ్చారని, వారిలో ఎవ్వరికీ వైరస్ లేదని జైశంకర్ తెలిపారు.