జాతీయ వార్తలు
కరోనా వైరస్‌తో భారత్‌కు దెబ్బ!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, మార్చి 11: చైనా నుంచి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు వ్యాప్తి చెందుతున్న ప్రాణాంతక కరోనా వైరస్ వల్ల భారత్‌కు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత పరిశ్రమలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన బుధవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా అందించిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ప్రత్యేకించి ఫార్మాస్యూటికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాలు కరోనా వైరస్ కారణంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఈ రంగాల్లో ఎక్కువ శాతం కంపెనీలు ముడిసరుకును చైనా నుంచే దిగుమతి చేసుకోవడం ఇందుకు ప్రధాన కారణమని ఆయన అన్నారు. కరోనా వైరస్ కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడంతో పలు కంపెనీల్లో ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. అంతేకాకుండా ఎగుమతులు కూడా దాదాపుగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో చైనా నుంచి భారత్ డిమాండ్‌కు తగ్గట్టు ముడిసరుకులు అందడం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న నిల్వలతో భారత పరిశ్రమ కొంతకాలం నెట్టుకొచ్చినా ఆ తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉందని అన్నారు. అయితే, పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.