జాతీయ వార్తలు

కొత్త తేజాన్ని ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 8: దేశంలో పౌష్టికాహార లోపాన్ని తొలగించడంతోపాటు జల సంరక్షణకు విశేషంగా తోడ్పడాలని నారీశక్తి అవార్డు గ్రహీతలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ అవార్డులు పొందిన 15 మందిలో 14 మందితో ఆదివారం ఆయన తన అధికార నివాసంలో మాట్లాడారు. వీరు సాధించిన విజయాలు అనేక యూనివర్సిటీలకు అధ్యయన అంశాలు కావచ్చునని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ విజేతలందరూ కూడా అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొని, తమ సొంత కాళ్లపై వారు నిలబడ్డవాళ్లేనని మోదీ తెలిపారు. కాశ్మీర్‌కు చెందిన ఓ మహిళతో మాట్లాడిన ఆయన ‘మీ వ్యాపారం మరింత వేగంగా ముందుకు సాగుతుంది’ అని అన్నారు. అన్ని రకాల అవరోధాలను అధిగమిస్తూ ఈ మహిళలు సాధించిన విజయాలు సామాన్యమైనవి కాదని, వారి పట్టుదల స్ఫూర్తి, అనుకున్నది సాధించాలన్న తపనకు నిదర్శనాలని మోదీ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలు, కార్యక్రమాలు అనుకున్న ఫలితాలను సాధించాయంటే అందుకు ప్రజల కృషి ఎంతో ఉందని అన్నారు. కేవలం ప్రభుత్వం తనంతట తానుగా ఇంతటి విజయాలను నమోదు చేసుకోజాలదని, మహిళలు సహా సమాజంలోని అన్ని వర్గాల తోడ్పాటు ఉంటేనే ఇవి సుసాధ్యమవుతాయని తెలిపారు. ముఖ్యంగా పౌష్టికాహార లోపాన్ని తొలగించడంలో నారీశక్తి అవార్డు విజేతలు తమదైన స్ఫూర్తితో చేయూతనివ్వాలని అన్నారు. అలాగే జల్ జీవన్ మిషన్ లక్ష్యాలను సాధించడానికి కూడా మహిళల తోడ్పాటు, కృషి ఎంతో అవసరమని అన్నారు. తరిగిపోతున్న సహజ వనరులను పరిరక్షించుకోవడంతోపాటు జల సంరక్షణ బాధ్యతను చేపట్టి ప్రతిఒక్కరికీ నీటిని అందుబాటులోకి తేవాలన్న ప్రభుత్వం సంకల్పానికి మహిళల తోడ్పాటు ఎంతో అవసరమని అన్నారు.

*చిత్రం... ప్రధాని మోదీని ఆశీర్వదిస్తున్న నారీశక్తి విజేత మాన్‌కౌర్