జాతీయ వార్తలు

‘మీలో దేవుడిని చూశాను’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 7: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం భావోద్వేగానికి లోనయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జనరిక్ మెడిసిన్ కార్యక్రమం’ లబ్ధిదారు అయిన ఒక మహిళ ప్రధానికి ‘మీలో దేవుడిని చూశాను’ అని చెప్పడంతో మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. డెహ్రాడూన్ నివాసి దీపా షా 2011లో పక్షవాతంతో బాధపడ్డారు. అయితే, ‘జన్ ఔషధి దివస్’ను పురస్కరించుకొని శనివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రితో మాట్లాడారు. ‘నేను దేవుడిని చూడలేదు. కాని, మీలో దేవుడిని చూశాను’ అని ఆమె కన్నీరు కారుస్తూ చెప్పారు. ఆ మహిళ ఈ వ్యాఖ్యలను మళ్లీ మళ్లీ చెప్పడంతో మోదీ భావోద్వేగానికి గురికావడం స్పష్టంగా కనిపించింది. పక్షవాతంతో బాధపడుతున్న కాలంలో తనకు సహాయపడిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి, ఇతరులకు కూడా దీపా షా కృతజ్ఞతలు తెలిపారు. అప్పట్లో ఒకసారి తనకు పక్షవాతం నయం కాదని డాక్టర్లు చెప్పారని ఆమె తెలిపారు. ‘కాని, మీ మాటలు వింటుంటే నేను మెరుగయ్యాను’ అని ఆమె మోదీని ఉద్దేశించి అన్నారు. ఔషధాల ధరలు తగ్గించేందుకు చేసిన కృషికి గాను ఆమె ప్రధాన మంత్రికి అమితంగా కృతజ్ఞతలు తెలిపారు. భావోద్వేగానికి గురయిన మోదీ ఒక్క క్షణం వౌనంగా ఉండిపోయారు. తరువాత ప్రతిస్పందిస్తూ ఆమె ధైర్యమే ఆ వ్యాధిపై విజయం సాధించిందని అన్నారు. ఆ స్ఫూర్తిని ఎల్లవేళలా కొనసాగించాలని ఆయన దీపా షాకు సూచించారు. దీపా షా ఈ సందర్భంగా 2011 నుంచి పక్షవాతం కారణంగా పడిన బాధలను, ఔషధాల అధిక ధరల వల్ల తాను పడిన ఇబ్బందులను ఈ సందర్భంగా వివరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనరిక్ మెడిసిన్ కార్యక్రమం వల్ల చౌక ధరలకు ఔషధాలు లభిస్తుండటంతో ఇప్పుడు తాను ప్రతి నెలా రూ. 3,500 పొదుపు చేయడం ప్రారంభించానని ఆమె చెప్పారు.