జాతీయ వార్తలు

30కి చేరిన కరోనా కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 30కి చేరింది. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. గురువారం మరో వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్‌గా వెల్లడి కావడంతో మొత్తం సంఖ్య 30కి పెరిగిందని, అయితే, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నదని, నివారణ చర్యలు తీసుకుంటున్నదని ఆయన పేర్కొన్నారు. సరికొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి అన్నివిధాల సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఆగ్రాలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇరాన్‌లో చిక్కుకుపోయిన కొంతమంది భారత యాత్రీకులు, విద్యార్థుల పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ అధికారులతో సంప్రదిస్తున్నామని, వారిని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. గురుగామ్‌లోని పేటీఎం కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి రెండు రోజుల క్రితం కరోనా వైరస్ సోకినట్టు ఆయన ప్రకటించారు. ఇటలీ టూరిస్టులు 15 మందికి ఈ వైరస్ ఉందన్న విషయాన్ని ఆయన సభాముఖంగా తెలిపారు. గత మూడు రోజుల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కొంతమందికి కరోనా వైరస్ ఉన్నట్టు ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ముందు జాగ్రత్త చర్యగా మిగతా వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు.

*చిత్రం... ఎయిర్ మాస్క్‌లు ధరించి పార్లమెంటు సమావేశాలకు హాజరైన ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ రాణా