జాతీయ వార్తలు

అత్యాచార కేసు వాపస్ తీసుకుంటారా? లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 3: అత్యాచారం కేసు పెట్టారన్న కక్షతో ఓ 29 ఏళ్ళ మహిళను, ఆమె భర్తను దుండగులు అపహరించి తీవ్రంగా కొట్టారు. మహారాష్టలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఈ ఘోరం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మంగళవారం అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పారు. ఇద్దరు మహిళా పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నాసిక్ రూరల్ ఎస్‌పీ ఆర్తి సింగ్, అహ్మద్‌నగర్ అదనపు ఎస్‌పీ దీపాలీ కాలే నెల రోజుల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక అందజేస్తారని ఆయన చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అడిగిన ఓ ప్రశ్నకు హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ స్పందిస్తూ గత నెల 24న అపహరణ జరిగిందన్నారు. ఓ మహిళ, ఆమె భర్త ఔరంగబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి నుంచి నివాసం వెళ్ళేందుకు ఒక ఆటో మాట్లాడుకున్నారని చెప్పారు. అయితే మార్గమధ్యంలో ఒక వ్యక్తి ఆటోలో ఎక్కడంతో ఆ జంట తీవ్రంగా వ్యతిరేకించినట్లు ఆయన తెలిపారు. ఆటోలో ఎక్కిన దుండగుడు ఆ జంటపై మత్తుమందు చల్లి, వారిని అపహరించి గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్ళినట్లు ఆయన తెలిపారు. అక్కడ 8 మంది దుండగులు వారిని చితక్కొట్టి, పెట్రోలు పోసి 2016 నాటి అత్యాచార కేసును ఉపసంహరించుకోవాలని వత్తిడి చేశారని మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వివరించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో సోమవారం వైరల్ కావడంతో పోలీసులు ఆ జంట వద్దకు వెళ్ళి కేసు నమోదు చేశారు.