జాతీయ వార్తలు

దీదీ ఉంది.. డోంట్ వర్రీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలియాగంజ్ (పశ్చిమ బెంగాల్), మార్చి 3: బంగ్లాదేశ్ నుంచి వచ్చి పశ్చిమ బెంగాల్ నివసిస్తున్నవారంతా భారత పౌరులేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నివసిస్తూ వివిధ పార్టీలకు ఓటు గెలిపిస్తున్న మీరంతా భారత పౌరులేనని మంగళవారం ఇక్కడ జరిగిన ఓ సభలో మమత భరోసా ఇచ్చారు. బీజేపీ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ వర్తించబోదనీ.. మీకు అండగా నేను ఉన్నాను.. మీరు మరోసారి పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం ఉండదు అని మమత పేర్కొన్నారు. ఢిల్లీలో ఇటీవలి జరిగిన మత ఘర్షణలు, మరణించిన 42 మంది గురించి ప్రస్తావిస్తూ.. పశ్చిమ బెంగాల్‌లో అలాంటి పరిస్థితులు రానివ్వబోనని స్పష్టం చేశారు. ‘బెంగాల్‌ను మరో ఢిల్లీ కానివ్వను’ అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఢిల్లీ అల్లర్లు జరిగాయని మమత తెలిపారు. ఏ ఒక్క వ్యక్తిని బెంగాల్ నుంచి బయటకు పంపించే ఆలోచన ఎంతమాత్రం చేయనని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ‘బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చిన వారంతా భారతీయులే.. వాళ్లకు ఇప్పటికే పౌరసత్వం ఉంది.. మీరు పౌరసత్వం కోసం దరఖాస్తు చేయనవసరం లేదు.. మీరు ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు. ముఖ్యమంత్రిని, ప్రధాన మంత్రిని ఎన్నుకొంటున్నారు.. అసెంబ్లీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా ఓటు వేస్తున్నారు.. వాళ్లు ఇప్పుడు మిమ్మల్ని భారత పౌరులు కాదని అంటున్నారు.. మీరంతా కచ్చితంగా భారతదేశ పౌరులే’ అని ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చిన నివసిస్తున్న వారిని ఉద్దేశించి మమత వ్యాఖ్యానించారు. ‘దీదీ మీ వెంట ఉంటుంది.. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. మీ కుటుంబం అంటే నా కుటుంబమే’ అని స్పష్టం చేశారు. ‘మీకంటూ ఓ అడ్రస్సు ఉంది.. రేషన్‌కార్డు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు ఉన్నాయి.. బీజేపీ ఇచ్చే కార్డు ఎంతమాత్రం మీకు అవసరం లేదు’ అని మమత స్పష్టం చేశారు. వెనుకబడిన తరగతులకు చెందిన రాజ్‌బొంగ్సీ, కుర్మీ, కుజూర్, ఉర్దూ అలిచీల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను టీఎంసీ ప్రభుత్వం చేస్తోందని పేర్కొన్నారు. జాతీయ పౌరసత్వ రిజిస్టర్ నుంచి అనేక మంది నిజమైన బెంగాలీలు, రాజ్‌బొంగ్సీ, ముస్లిం పౌరులను అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం తొలగించిందని మమత ఆరోపించారు.