జాతీయ వార్తలు

‘ఢిల్లీ’పై మళ్లీ దద్దరిల్లిన పార్లమెంటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 3: ఢిల్లీ అల్లర్లపై మంగళవారం కూడా పార్లమెంటు ఉభయ సభలు అట్టుడికాయి. వీటిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తక్షణమే చర్చను చేపట్టాలని ఉభ య సభల్లోనూ ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దరిమిలా చోటుచేసుకున్న గందరగోళ పరిస్థితుల మ ధ్య ఉభయ సభలూ అనేకమార్లు వాయిదా పడ్డాయి. ఒకదశలో సభ్యులను సస్పెండ్ చేస్తానంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించాల్సిన పరిస్థితి తలెత్తింది. హోలీ తర్వాత ఈనెల 11న ఢిల్లీ అల్లర్లపై సభలో చర్చ జరుపుతానని ఆయన ప్రకటించారు. అయినా శాంతించని ప్రతిపక్షాలు రాద్ధాంతం సృష్టించడంతో సభ బుధవారం నాటికి వాయిదా పడింది. ఢిల్లీ అల్లర్లపై తక్షణమే చర్చ జరగాలన్న విపక్షాల
డిమాండ్ ఫలితంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య సోమవారంలాగే తోపులాటలు చోటుచేసుకునే పరిస్థితి తలెత్తింది. ఈనెల 11న ఢిల్లీ అల్లర్లపై చర్చ జరుపుతామని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించినప్పటికి కూడా ప్రతిపక్ష సభ్యులు ఏమాత్రం శాంతించలేదు. వెంటనే చర్చను చేపట్టాలని స్పీకర్ వేదిక ముందుకు దూసుకువెళ్లారు. దాంతో సభలో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సభ్యులు పరస్పరం తోసుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఆగ్రహించిన స్పీకర్ ‘సభ్యులు శాంతించకపోతే ఇరు పక్షాలను ఈ సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేస్తా’ అని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి అధికార పక్ష సభ్యులు కూర్చున్నవైపు వెళ్లడంతో గందరగోళం మొదలైంది. ఆయన వెనకాలే ఇతర ప్రతిపక్ష సభ్యులు కూడా అధికార సభ్యుల వైపు వెళ్లారు. వారు రాకుండా బీజేపీ సభ్యులు అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ సభ్యుడు లాకెట్ చటర్జీ కాంగ్రెస్ నాయకుడు చౌదరితో తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధానికి దిగడం కనిపించింది. వారిని శాంతింపజేసేందుకు కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రయత్నించారు. ఆ గందరగోళ పరిస్థితుల మధ్యే కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య తోపులాటలు జరిగాయి. ఒకదశలో కొందరు సభ్యులు సెక్రెటరీ జనరల్ కార్యాలయానికి సంబంధించిన తలుపును గట్టిగా బాదడం కనిపించింది. పరిస్థితి తీవ్రతను గమనించిన స్పీకర్ ఓం బిర్లా సభను బుధవారానికి వాయిదా వేశారు. సభ వాయిదా పడిన తర్వాత కూడా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ‘తలుపు మోదడం’పై విపక్ష సభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఆమెను శాంతింపజేసేందుకు కొందరు బీజేపీ సభ్యులు ప్రయత్నించారు. మంగళవారం సభ ప్రారంభమైన వెంటనే ఢిల్లీ అల్లర్ల అంశాన్ని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. వెంటనే చర్చ జరగాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. దాంతో సభను స్పీకర్ రెండుసార్లు వాయిదా వేశారు. మళ్లీ రెండు గంటల తర్వాత మొదలైన సభలో మాట్లాడిన ఆయన ‘నేను అధికార, విపక్ష సభ్యులతో మాట్లాడాను. స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అంగీకరించారు’ అని వెల్లడించారు. ఈనెల 11న హోలీ అనంతరం ఢిల్లీ అల్లర్లపై సభలో చర్చించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని ఆయన తెలిపారు. చర్చకు అంగీకరించినందున సభ్యులు శాంతించి ఆనందంగా హోలీ పర్వదినంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. వెంటనే సభ్యులందరూ తమ తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని, తదుపరి సభా కార్యకలాపాలు చేపట్టేందుకు తోడ్పడాలని కోరారు. అయినా కూడా శాంతించని విపక్షాలు బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశాయి. కొందరైతే తమ చేతిలో ఉన్న కాగితాలను చింపేసి సభ మధ్యకు విసిరారు. అయినా కూడా స్పీకర్ సభను కొనసాగించే ప్రయత్నం చేశారు. ఆ గందరగోళంలోనే బ్యాంకింగ్ నియంత్రణ సవరణ బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు.
*చిత్రం... లోక్‌సభలో మంగళవారం విపక్ష సభ్యుల నిరసన