జాతీయ వార్తలు

ప్రశాంతతే ప్రగతికి పునాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 3: దేశం అభివృద్ధి చెందాలంటే శాంతి, సామరస్యం, సమైక్యత అన్నవి అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సమాజంలో సామరస్యపూర్వక వాతావరణం పెంపొందించేందుకు క్రియాశీలకంగా కృషి చేయాలని పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. మంగళవారంనాడు ఇక్కడ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ ‘స్వాతంత్య్ర సంగ్రామ అనంతరం వందేమాతరంపై ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తారో ఇప్పుడు భారత్ మాతాకీ జై అన్న నినాదంపైనా వివాదాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు’ అని అన్నారు. భారతదేశం గురించి ఉద్వేగభరితమైన అభిప్రాయాన్ని కలిగించే రీతిలో భారత్ మాతాకీ జై అన్న నినాదాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఇటీవల మన్మోహన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మన్మోహన్ ప్రకటనను పరోక్షంగా ప్రస్తావించిన మోదీ కొందరు వ్యక్తులకు భారత్ మాతా కీ జై అన్న నినాదమే చెడుగా కనిపిస్తోందని అన్నారు. ఢిల్లీ అల్లర్ల అనంతరం తొలిసారిగా పార్టీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ భారతీయ జనతా పార్టీకి జాతీయ ప్రయోజనాలే తొలి ప్రాధాన్యమని, కానీ ఇతర పార్టీలకు మాత్రం వారి సొంత ప్రయోజనాలే పరమావధి అని వ్యాఖ్యానించారు. ఈ సమావేశ వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు తెలియజేశారు. శాంతి, సామరస్యపూర్వక పరిస్థితులు బలంగా నెలకొంటేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీలకు మోదీ విస్పష్టంగా తెలియజేశారని జోషి తెలిపారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా వాస్తవికంగా కూడా శాంతి, సామరస్యాలను పరిరక్షించడంలో గుణాత్మకంగా వ్యవహరించాలని ఎంపీలకు మోదీ ఉద్భోదించినట్టు జోషి తెలిపారు. ఆలోచనల్లోనూ, మాటల్లోనూ, చేతల్లోనూ (మనసా, వాచా, కర్మణా) దేశాభివృద్ధి కోసం ఎంపీలు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చినట్టుగా ఆయన తెలిపారు. బీజేపీ నేతలు సమాజంలో వైషమ్యాలను సృష్టించే రీతిలో మాట్లాడుతున్నారంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ పార్టీ ఎంపీలకు ఈ హితబోధ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్ మాతా కీ జై అన్న పవిత్ర భావనను మనసులో ఉంచుకుని దేశాభివృద్ధి కోసం, ప్రజల వికాసం కోసం ఎంపీలు కృషి చేయాలని మోదీ ఈ సమావేశంలో కోరినట్టు జోషి తెలిపారు. అలాగే, ప్రజలకు సరసమైన రేట్లకే మందులను అందిస్తున్న జన ఔషధి కేంద్రాల వల్ల కలుగుతున్న ప్రయోజనాలను కూడా మోదీ ఈ సమావేశంలో వివరించారని, ఈనెల 7న లబ్ధిదారులతో ఆయన సమావేశం కాబోతున్నారని జోషి తెలిపారు.
*చిత్రం...ఢిల్లీలో మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన ప్రధాని మోదీ,
హోం మంత్రి అమిత్ షా, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ