జాతీయ వార్తలు

మేము జోక్యం చేసుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 3: తీవ్ర స్థాయిలో ఆందోళనలు రేకెత్తిస్తున్న పౌరసత్వ చట్ట వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్ సుప్రీం కోర్టులో అసాధారణ రీతిలో పిటిషన్ దాఖలు చేశారు.
అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలను, నియమ, నిబంధనలను, ప్రమాణాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా కోరారు. మానవ హక్కుల పరిరక్షణ బాధ్యత తమది కాబట్టి ఈ వ్యవహారంలో మూడో పార్టీగా జోక్యం చేసుకోవాలనుకుంటున్నామని తెలిపారు. అయితే ఆయన చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. తమ అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని తెగేసి చెప్పింది. భారత దేశం పౌరసత్వ సవరణ చట్టాన్ని చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్ మైఖెల్లే బాచెలెట్ సోమవారం జెనీవాలో తెలిపారు. కాగా ఇది పూర్తిగా తమ అంతరంగిక విషయమని, తమ దేశ సార్వభౌమాధికారం విషయంలో జోక్యం చేసుకోవడం తగదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రావీష్ కుమార్ స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటీషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్నదన్నారు. సీఏఏ అంతరంగిక వ్యవహారమని, సార్వభౌమాధికార భారత పార్లమెంటు చట్టాలు చేస్తుందని, ఇందులో ఇతరుల, విదేశాల జోక్యం చేసుకోవడానికి వీల్లేదని కుమార్ తెలిపారు. తమది ప్రజాస్వామ్య దేశమని, రాజ్యాంగబద్ధంగా చట్టం చేయడం జరిగిందది ఆయన వివరించారు. స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయ వ్యవస్థను తాము గౌరవిస్తామని, న్యాయబద్ధంగా చేసిన సీఏఏ విషయంలో కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని ఆయన ధీమాగా అన్నారు. 2014 డిసెంబర్ నెలాఖరు వరకు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ దేశాల్లో స్థిరపడిన ముస్లిమేతరులైన హిందువులు, సిక్కులు, బౌద్దులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు భారత్‌కు తిరిగి వచ్చేస్తే పౌరసత్వం కల్పించేందుకు వీలుగా కేంద్రం చట్టం చేసిన సంగతి తెలిసిందే.