జాతీయ వార్తలు

పార్లమెంట్‌లో టెన్షన్.. టెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 3: పార్లమెంట్ ప్రాంగణం.. మంగళవారం ఉదయం 9.30 గంటలు కావస్తోంది. ఒక్కసారిగా అందరిలో టెన్షన్ మొదలైంది.. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సభ్యులు ఒక్కొక్కరుగా వారి వారి వాహనాలపై వస్తున్నారు.
ఒక్కసారిగా హఠాత్పరిణామం.. ఓ ఎస్‌యూవీ వాహనం వేగంగా వస్తూ అదుపుతప్పి అక్కడ ఉన్న ఇనుప బారికేడ్లను ఢీకొట్టుకొంటూ వెళ్లింది. అంతే.. అక్కడ ఉన్న సెక్యూరిటీ ఒక్కసారిగా అప్రమత్తమైంది. మళ్లీ ఎక్కడ ఉగ్రవాద దాడి జరుగుతోందేమోనన్న ఆందోళనతో అంతా అలెర్టయి సైరన్ మోగించారు. యావత్ సీఆర్‌పీఎఫ్ బలగాలు ఆయుధాలతో రె‘్ఢ’ అయిపోయారు. నెమ్మదిగా తెలిసింది ఆ వాహనం ఓ బీజేపీ ఎంపీదని.. యూపీలోని కౌసంబి పార్లమెంట్ సభ్యుడు వినోద్‌కుమార్ సోంకర్ తన ఇన్నోవా క్రిస్టా వాహనంలో వస్తుండగా విజయ్‌చౌక్ గేట్ దాటిన వెంటనే అదుపుతప్పి బారికేడ్లను ఢీకొంటూ వెళ్లడంతో ఈ సంఘటన చోటు చేసుకొంది. అప్రమత్తమైన సెక్యూరిటీ వెంటనే ఎక్కడికక్కడ వాహనాలను ఆపి తనిఖీలు ఆపి నెమ్మదిగా లోపలికి వదిలారు. ఎక్కడా ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకొన్నారు.