జాతీయ వార్తలు

ఉరి అమలులో జాప్యం.. వ్యవస్థ వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచార దోషులకు ఉరి శిక్ష అమలు చేయడంలో జాప్యం జరుగుతుండడం పట్ల వ్యవస్థ వైఫల్యంగా కనిపిస్తున్నదని నిర్భయ తల్లి ఆశాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ దోషులకు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఉరి శిక్ష అమలు చేయరాదని ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశించడంపై ఆశాదేవి మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా ప్రతిస్పందించారు. తీర్పు అమలులో ఎలా జాప్యం జరుగుతున్నదో యావత్ ప్రపంచం గమనిస్తున్నదని ఆమె అన్నారు. నిర్భయ దోషులు నలుగురికి ఉరి శిక్ష అమలు చేయడంలో మూడోసారి వాయిదా పడిందని ఆమె చెప్పారు. ఇలా వాయిదా పడుతుండడం వల్ల వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతున్నదని, అయినా తాను న్యాయం కోసం ఎదురు చూస్తూ నిలబడుతున్నానని ఆమె తెలిపారు. అయినా తాను మొక్కవోని ధైర్యంతో నిర్భయకు న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేస్తూనే ఉంటానన్నారు. దోషులు ఏవో కుంటి సాకులు చూపిస్తూ ఉరి అమలును వాయిదా వేయిస్తున్నారని ఆమె విమర్శించారు. దోషులు చేసే డ్రామాను కోర్టు చూస్తున్నదని ఆశాదేవి అన్నారు. లోగడ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 2012 నాటి నిర్భయ అత్యాచార దోషులకు 3న (మంగళవారం) ఉదయం 6 గంటలకు ఉరి తీయాల్సి ఉండగా, అదనపు సెషన్స్ న్యాయమూర్తి ధర్మేందర్ రాణా ఉరి శిక్ష అమలును తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు వాయిదా వేయాలని ఆదేశించారు. క్షమాబిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున ఉరి శిక్ష అమలును వాయిదా వేశారు.

*చిత్రం... నిర్భయ తల్లి ఆశాదేవి