జాతీయ వార్తలు

భారత్ ‘విశ్వ’కాంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 2: అంతర్జాతీయ స్థాయిలో భారతీయులు తమ ప్రతిభా సంపత్తులను విభిన్న కోణాల్లో చాటి చెబుతున్నారని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ సోమవారం నాడిక్కడ జరిగిన సదస్సులో స్పష్టం చేశారు. చారిత్రక వైరుధ్యాలను అధిగమించి భారత్ సరికొత్త రీతిలో తమ సత్తాను చాటుకోవడం వల్లే అంతర్జాతీయ వేదికలపై మరింత క్రియాశీలకంగా వ్యవహారించడానికి దారులు తెరుచుకున్నాయని ఆయన తెలిపారు. గత కొన్ని సంవత్సరాల్లో విశ్వ వేదికల్లో భారత్ అనేక రీతుల్లో అవిరలంగా కృషి చేస్తూ వస్తోందని, ఆ విధంగా తన భూమికను విస్తరించుకుంటున్నదని జైశంకర్ తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిలదొక్కుకుంటూ ముందుకు సాగుతున్న భారత్‌ను కొన్ని దేశాలు పోటీ దేశంగా, మరి కొన్ని దేశాలు సమాన ప్రాధాన్యత కలిగిన దేశంగా గుర్తిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ జరిపిన అంతర్జాతీయ ప్రచారం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని వెల్లడించారు. అదేవిధంగా ప్రజల మధ్య సంథానతకు సంబంధించి కూడా భారత్ చేసిన కృషి అంతర్జాతీయంగా మంచి ఫలితాలు ఇచ్చిందని తెలిపారు. రాజకీయ స్థాయిలో కూడా వ్యూహాత్మక స్పష్టతతో భారత్ వ్యవహారించడం వల్ల ఎంతగానో గుర్తింపు లభించిందని మరింత విస్తృత భూమికకు మార్గం తెరుచుకుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అనేక కోణాల్లో, రీతుల్లో, దృక్ఫథాల్లో భారతీయత ప్రస్పుటం అవుతూ వచ్చిందన్నారు. గత ప్రభుత్వాలు పాకిస్తాన్ విషయంలో సరైన రీతిలో వ్యవహారించలేకపోయాయని పేర్కొన్న ఆయన 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందం వల్ల పాకిస్తాన్ మరింతగా బరితెగించే పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే 1962లో చైనాతో జరిగిన యుద్ధం నాటి పరిస్థితులను చీకటి కోణాలుగా జైశంకర్ అభివర్ణించారు. ముంబయి నగరంపై జరిగిన 26/11 ఉగ్ర దాడి నేపథ్యంలో కూడా అప్పటి ప్రభుత్వం అవసరమైన రీతిలో ప్రతిస్పందించలేదన్నారు. సౌర విద్యుత్తు వినియోగాన్ని పెంచే రీతిలో అంతర్జాతీయంగా కూటమిని ఏర్పాటు చేయడంలోనూ విపత్తులను ఎదుర్కొనేందుకు నిరోధక వ్యవస్థను ఆవిష్కృతం చేయడంలోనూ భారత్ చేసిన కృషికి అంతర్జాతీయంగా సానుకూల స్పందన వచ్చిందన్నారు. ఆఫ్రికా ఖండంలో భారత్ అడుగులు మరింత బలంగా పడుతున్నాయని, అనేక కోణాల్లో అక్కడి దేశాలకు సన్నిహితమైందని తెలిపారు. ఈ నేపథ్యంలో భారత దేశం తదుపరి పరివర్తనా దశలో అడుగు పెడుతున్నదని పేర్కొన్నారు. మారుతున్న భౌగోళిక, రాజకీయ పరిణామాలను ప్రస్తావించిన జైశంకర్ ‘సిద్ధాంతాలు, గుర్తింపులు, వ్యాపారపరమైన అంశాలు, రాజకీయాలు, చరిత్రతో మేళవించిన అంశాలు, కొత్త ప్రపంచ వ్యవస్థను ఆవిష్కరిస్తున్నాయి. అర్థవంతమైన రీతిలో ప్రపంచ దేశాలు చర్చించుకోవడం ద్వారా ఈ సవాళ్ళను అధిగమించగలుగుతాయి’ అని తెలిపారు. ఒక దశలో ప్రపంచీకరణను భుజానికి ఎత్తుకున్న దేశాలు ఇప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయని, వాటిపై చర్చకూ సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఆయా దేశాలకు తమ ప్రయోజనాల పరిరక్షణ అన్నది ఒక సవాల్‌గా మారిందన్నారు. టెక్నాలజీ, డేటా రక్షణ, భద్రత అన్నది వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకున్నాయని పేర్కొన్న ఆయన ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే విదేశాంగ మంత్రిత్వ శాఖలో టెక్నాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. పెరుగుతున్న జాతీయవాద నేపథ్యంలో మొత్తం ప్రపంచ వ్యవస్థనే తిరిగి సమతూకంలో పెట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ప్రపంచ వ్యవస్థ కూడా సంధికాలంలో ఉందని పేర్కొన్న ఆయన ‘అమెరికా జాతీయవాదం కొత్త శిఖరాలను అధిరోహించాలన్న చైనా ఆశావాదం, చీలిన ఐరోపా ఖండం, విశ్వ వేదికలపై మళ్లీ సత్తా చాటుకోవాలన్న రష్యా తాపత్రయం, ఆసియా దేశాల అభద్రత ఇందుకు కారణమవుతున్నాయి’ అని వివరించారు.

*చిత్రం... విదేశాంగ మంత్రి జైశంకర్