జాతీయ వార్తలు

‘ఢిల్లీ’పై చర్చకు ప్రభుత్వం విముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 2: ఢిల్లీ అల్లర్లపై పార్లమెంటులో చర్చించడానికి ప్రభుత్వం ఎంతమాత్రం సుముఖంగా లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్వరంతో ఆరోపించింది. బీజేపీకి చెందిన ఓ సభ్యుడు లోక్‌సభలో ఓ దళిత మహిళా ఎంపీపై దురుసుగా ప్రవర్తించారని తెలిపింది. లోక్‌సభ మంగళవారానికి వాయిదా పడిన అనంతరం కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ అల్లర్లపై సభలో చర్చించాలని తాము గట్టిగా డిమాండ్ చేశామని తెలిపారు. ఈ చర్చలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా కూడా పాల్గొనాలని, ప్రజలందరూ వీరి సమాధానం కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. ఈ చర్చకు ప్రభుత్వం ఎంతమాత్రం సభలో అనుమతించలేదని, కుంటిసాకులతో వాయిదా ధోరణిని అవలంబిస్తోందని ఆయన అన్నారు.