జాతీయ వార్తలు

పథకం ప్రకారమే ఢిల్లీ అల్లర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 2: ఢిల్లీలో ఇటీవల జరిగిన మత ఘర్షణలు రాజ్య ప్రోత్సాహంతో ఓ పథకం ప్రకారం జరిగిన మారణకాండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. దేశవ్యాప్తంగా గుజరాత్ తరహా అల్లర్లను సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ సోమవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన మమతా బెనర్జీ పౌరసత్వ సవరణ చట్టం కారణంగానే ఢిల్లీ అల్లర్లలో అనేకమంది మరణించారని అన్నారు. ఈ వాస్తవాన్ని హోం మంత్రి అమిత్ షా గమనించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఆదివారం కోల్‌కతాలో జరిగిన అమిత్ షా ర్యాలీ సందర్భంగా ‘గోలీ మారో’ అన్న నినాదాలు చేయడాన్ని ఆమె గర్హించారు. ఢిల్లీలో 42 మంది అమాయకులు మరణించడం తనకెంతో మనస్థాపం కలిగిస్తోందని, అది ఓ పథకం ప్రకారం జరిగిన హత్యాకాండ అని ఆమె అన్నారు. మొదట ఓ పథకం ప్రకారం హింసాకాండను సృష్టించి, ఆ తర్వాత వాటికి మతకలహాలు అన్న ముద్ర వేశారని పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు కేంద్రం ఆధీనంలో ఉంటారని, అలాగే సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ దళాలు కూడా అంత జరుగుతున్నా ఏమీ చేయకుండా ఉండిపోయాయని మమతా బెనర్జీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేసిన అమిత్ షా ముందు ఢిల్లీ అల్లర్లకు సంబంధించి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు బీజేపీ ఎందుకు క్షమాపణ చెప్పలేదని ప్రశ్నించిన మమతా బెనర్జీ ‘వారిక్కడకు వచ్చి పశ్చిమ బెంగాల్‌ను కబ్జా చేస్తామని నిస్సిగ్గుగా చెబుతున్నారు’ అని అన్నారు.
పశ్చిమ బెంగాల్‌తో సహా దేశవ్యాప్తంగా గుజరాత్ తరహా అల్లర్లను సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 2002 గుజరాత్ అల్లర్ల తర్వాత ఉత్తరప్రదేశ్‌లో వాటిని సృష్టించారని, ఇప్పుడు ఢిల్లీలో కూడా అదే రీతిలో వ్యవహరించారని ఆమె ధ్వజమెత్తారు. ఢిల్లీలో జరిగిన మత ఘర్షణలకు నిరసనగా రాష్టవ్య్రాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అలాగే బాధితుల కోసం నిధులను సేకరించాలని కూడా కోరారు. అమిత్ షా ర్యాలీలో ‘గోలీ మారో’ అన్న నినాదాలు చేసిన వారిని పోలీసులు వదిలిపెట్టరని ఆమె అన్నారు. ఈ రకమైన నినాదాలు ప్రజలను రెచ్చగొట్టేందుకు జరిగిన ప్రయత్నాలేనని, చట్టవ్యతిరేకమని పేర్కొన్నారు. ఢిల్లీలో వ్యవహరించినట్టుగా కోల్‌కతా తమ పప్పులు ఉడకవన్న విషయాన్ని బీజేపీ గుర్తుపెట్టుకోవాలని అన్నారు. తమ పోలీసులు ఇప్పటికే సంబంధిత వ్యక్తులపై చర్యలు చేపట్టారని, ముగ్గురు బీజేపీ మద్దతుదారులను అరెస్టు చేశారని తెలిపారు. ఢిల్లీ అల్లర్లను రెచ్చగొట్టిన ఓ బీజేపీ నాయకుడిని ఎందుకు అరెస్టు చేయలేదని ఆమె ప్రశ్నించారు. అలాగే విద్వేష ప్రసంగాలు చేస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై చర్యలు ఎందుకు చేపట్టలేదని అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి అల్లర్లను రెచ్చగొట్టడమో లేదా విద్వేషాలను రగిలించడమో పనిగా పెట్టుకుంటోందని బీజేపీపై ఆమె ధ్వజమెత్తారు. గత ఏడాది నుంచి వరుసగా అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ పరాజయం పొందుతోందని, అయినప్పటికీ నిస్సిగ్గుగా పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వస్తామని చెబుతోందని అన్నారు.
*చిత్రం... పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ