జాతీయ వార్తలు

రైతులకు అన్యాయమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్జాపూర్ (ఉత్తర్‌ప్రదేశ్), మార్చి 2: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతు ప్రభుత్వం అంటూ ఓ పక్క గొప్పలు చెప్పుకొంటూనే రైతుల భూములను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. సరకు రవాణా కారిడార్ నిర్మాణం కోసం భూసేకరణను మిర్జాపూర్ రైతులు ఓపక్క వ్యతిరేకిస్తుండగా.. వారి భూముల్లో వేసిన పంటలను ధ్వంసం చేస్తూ అడ్డొచ్చిన వారిపై లాఠీచార్జి జరిపారనీ.. ఏ విధంగా దీనిని రైతు ప్రభుత్వం అని పిలవాలని సోమవారం ప్రియాంక గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇది కచ్చితంగా రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి తమది రైతు ప్రభుత్వం అంటూ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారన్నారు. రైతు ప్రభుత్వం అని పేర్కొన్న ప్రభుత్వం 24 గంటలు తిరక్కుండానే సరకు రవాణా కారిడార్ నిర్మాణం పేరుతో ధ్వంసం చేసిందనీ.. అడ్డొచ్చిన వారిపై విచక్షణారహితంగా లాఠీచార్జి జరిపారని.. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మందికి గాయాలయ్యాయని ప్రియాంక పేర్కొన్నారు. అయితే, జిల్లా అధికార యంత్రాంగం లాఠీచార్జి ఘటనను చునార్ ఎస్‌డీఎం జంగ్ బహదూర్ పటేల్ ఖండించారు. కారిడార్ నిర్మాణం కోసం సదరు భూమిని 2009లోనే రైతుల నుంచి ప్రభుత్వం సేకరించి ఆమేరకు 2013-14 సంవత్సరంలో పరిహారం కూడా చెల్లించిందని ఆయన వివరించారు. ‘రెవెన్యూ రికార్డుల ప్రకారం 2014 నుంచి ఆ భూమి యజమాని రైల్వేలకు చెందిందని’ డీఎం సుశీల్ కుమార్ పటేల్ స్పష్టం చేశారు. ఈమేరకు అప్పట్లో పంటలు వేయమని రైతులు హామీ ఇచ్చారని.. కారిడార్ నిర్మాణం చేపడుతున్న సందర్భంలో వారు అంతకుముందు ఇచ్చిన హామీని విస్మరించి పంట సాగు చేశారని పేర్కొన్నారు. శనివారం సంబంధిత అధికారులు గ్రామానికి వచ్చిన రైతులకు పనులు చేపడుతున్నామని వివరించారని ఆయన పేర్కొన్నారు. నిర్మాణ పనులకు సహకరించాలని పదే పదే విజ్ఞప్తి చేశారన్నారు. జరుగుతున్న జాప్యం కారణంగా నిర్మాణ వ్యయం పెరుగుతోందని సంబంధిత నిర్మాణ సంస్థ వెల్లడించినట్లు ఎస్‌డీఎం జంగ్ బహదూర్ పటేల్ పేర్కొన్నారు. ఆదివారం నిర్మాణ పనులను సంస్థ ప్రారంభించిందనీ.. దీనికి రైతులు అభ్యంతరం చెప్పారని ఆయన పేర్కొంటూ ఈ సందర్భంగా ఎలాంటి లాఠీచార్జి జరగలేదని పేర్కొన్నారు. మహిళల నేతృత్వంలో నిరసన కార్యక్రమం జరిగినట్లు ఆయన వివరించారు. ఇదిలా ఉండగా.. భారతీయ కిసాన్ సేన జాతీయ అధ్యక్షుడు రాంరాజ్ పటేల్ మాట్లాడుతూ పోలీస్ చర్య కారణంగా ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని ఆయన పేర్కొన్నారు. కాగా, సోమవారం గ్రామస్థులు జిల్లా మెజిస్ట్రేట్‌ను కలిసి తక్షణమే కారిడార్ నిర్మాణ పనులు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లించాలని.. భూములిచ్చిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. రైతుల డిమాండ్‌పై నిరంతరం తాము పోరాటం సాగిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లలితేష్పతి త్రిపాఠి స్పష్టం చేశారు.