జాతీయ వార్తలు

సమాచారం ఇస్తే ఆదుకుంటాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 2: ఢిల్లీ అల్లర్లతో తీవ్రంగా నష్టపోయిన వారిలో అత్యవసరంగా ఆదుకోవాల్సిన వారి వివరాలు తెలియజేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలను కోరారు. ఆ విధంగా తెలియజేసినట్లయితే సహాయ చర్యలు చేపట్టాల్సిందిగా తాను సంబంధిత అధికారులను ఆదేశిస్తానని ఆయన చెప్పారు. సహాయ చర్యలను చేపట్టడంలో తాము 24/7 రోజులూ పని చేస్తున్నామని ఆయన తెలిపారు.
మీ దృష్టిలో ఇంకా ఎవరికైనా తగిన సహాయం అందాల్సి ఉందని భావించినట్లయితే వెంటనే తనకు వారి వివరాలు అందజేయాలన్నారు. దీంతో తాము వారి వద్దకు చేరుకుని తగిన సహాయం అందిస్తామని ఆయన వివరించారు. సహాయ, పునరావాస పనులు ఏ విధంగా జరుగుతున్నాయనేది తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నాని ఆయన తెలిపారు. అల్లర్లలో దుండగులు అమాయక ప్రజల ఇండ్లు ధ్వంసం చేశారని ఆయన వెల్లడించారు. అటువంటి కుటుంబాలకు రూ.25 వేలు సహాయంగా అందజేస్తున్నామని ఆయన వివరించారు. జాఫ్రాబాద్, వౌజ్‌పూర్, బాబర్‌పూర్, చాంద్ బాగ్, శివ విహార్, భాజన్‌పూర్, యమునా విహార్, ముస్త్ఫాబాద్ ప్రాంతాల్లో గత వారం జరిగిన అల్లర్లలో 42 మంది మరణించినట్లు ఆయన తెలిపారు. అల్లర్లలో స్థిర, చరాస్థులు కోల్పోయిన వారి వివరాలు సేకరించడంలో అధికారులు నిమగ్నమయ్యారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరలో బాధితులకు పరిహారం చెల్లించడం అవుతుందని ఆయన వివరించారు. ఈశాన్య ఢిల్లీలో సహాయ కేంద్రాలనూ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
అన్నీ కోల్పోయాం.. ఎలా అందజేయాలి?
సర్వస్వం కోల్పోయామని, తమ స్థిర, చరాస్థుల ఆధారాలు మంటల్లో బుగ్గి అయ్యాయని ఢిల్లీ అల్లర్లలో నష్టపోయిన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అల్లర్లలో ఏమీ కోల్పోయారో బాధితులు చెబితే, ఆధారాలు చూపిస్తే పరిహారం ఇస్తామని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అల్లర్లలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తామని కేజ్రీవాల్ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అల్లర్లలో ఇళ్ళు కోల్పోయిన వారికి తక్షణ సహాయంగా రూ.25 వేలు ప్రకటించారు. విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అయితే ఈశాన్య ఢిల్లీలోని ప్రజలను తక్షణమే ఆదుకోవడానికి ప్రభుత్వం సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడ ఉన్న వారు తాము సర్వస్వం కోల్పోయామని, ఇప్పుడు ప్రభుత్వం ఆధారాలు చూపించమంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. తాము అద్దెకు ఉంటున్నామని, దుండగుల దాడి, నిప్పు పెట్టడంతో ఆధార్, పాన్ కార్డుతో సహా ముఖ్యమైన డాక్యుమెంట్లన్నీ దగ్దమయ్యాయని అని ఓ మహిళ తెలిపారు.

*చిత్రం... ఢిల్లీ సీఎం కేజ్రీవాల్