జాతీయ వార్తలు

ఔరా.. ఔరంగాబాద్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔరంగాబాద్: బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని, ఎన్‌ఆర్‌సీల అమలును చేపట్టగా, మహారాష్టల్రో బీజేపీ పాలిత మున్సిపల్ కౌన్సిల్ ఈ రెండింటినీ వ్యతిరేకిస్తూ తీర్మానం ఆమోదించింది. ఈ వార్త బీజేపీ అధినాయకత్వాన్ని కలవరపరిచింది. నేతలు అవాక్కైయ్యారు. వివరాల్లోకి వెళితే... ఔరంగాబాద్‌లోని సేలు మున్సిపల్ కౌన్సిల్ సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. ఈ విషయాన్ని బీజేపీకి చెందిన మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ వినోద్ బొరాడే సోమవారం పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. ఫిబ్రవరి 28న ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించినట్లు ఆయన తెలిపారు. సమావేశం ప్రారంభంకాగానే ఎన్‌సీపీ, కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు సభ్యులు సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ప్రతిపాదించారని, దీనికి స్థానిక ప్రజాప్రతినిధులూ మద్దతు పలికారని ఆయన వివరించారు. నగర పరిషత్‌లో 27 మంది కౌన్సిలర్లు, ముగ్గురు కో-ఆప్టెడ్ సభ్యులున్నారని ఆయన తెలిపారు. ఈ తీర్మానాన్ని ఎవరూ వ్యతిరేకించలేదని, ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని ఆయన వివరించారు.
2014 డిసెంబర్ 31వ తేదీకి ముందు పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్‌లో స్థిరపడిన ముస్లిమేతరులు భారత్‌కు తిరిగి వచ్చినట్లయితే వారికి దేశ పౌరసత్వాన్ని ఇచ్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసింది. కాగా సీఏఏను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర స్థాయిల్లో అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. మున్సిపల్ కౌన్సిల్ బీజేపీ చేతిలో ఉన్నా, తమ పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం చేయడం చర్చనీయాంశమైంది.