జాతీయ వార్తలు

భవిష్యత్తుకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 1: భారత దేశ భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయడానికి నిర్దేశించిన రెండు రోజుల సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (సీపీఆర్) సదస్సు సోమవారం ప్రారంభం కానుంది. వివిధ రాజకీయ, భౌగోళికాది అంశాలతో పాటు నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) తగ్గుదల, వృద్ధి రేటు పతనం వంటి కీలకాంశాలు కూడా ఈ సదస్సులో చర్చకు వస్తాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్, మెఘాలయ ముఖ్యమంత్రి చోన్‌రాడ్ సంగ్మా, కాంగ్రెస్ నేత శశి థరూర్, నీతి ఆయో గ్ సభ్యుడు రమేష్ చంద్ తదితర హేమాహేమీలు ఈ సదస్సులో పాల్గొంటారు. 21వ శతాబ్దిలో భార త్ పరిస్థితిపై ఈ సదస్సులో చర్చ జరుగుతుంది. ఒక రకంగా భారత భవిష్యత్తుకు ఇక్కడే శ్రీకారం చుడతారు. రాబోయే కొన్ని దశాబ్దాల్లో దేశం ఎదుర్కోబోయే కీలక సమస్యలను గుర్తించి, పరిష్కార మార్గాలను కూడా అనే్వషిస్తారు. వాయు కాలు ష్యం, నిరక్షరాస్యత వంటి సమస్యలను కూడా ప్రస్తావనకు వస్తాయి. వ్యవసాయం, దేశ సామ ర్థ్యం, టెక్నాలజీ వంటి అంశాలను కూడా ఈ సదస్సులో సుదీర్ఘంగా చర్చిస్తారు. ప్రపంచ రాజకీయ ముఖ చిత్రం ఇటీవల కాలంలో అత్యంత వేగంగా మారిపోతున్న నేపథ్యంలో, భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ప్రభుత్వ సేవలను దేశ ప్రజలందరికీ చేరువ చేయడానికి భారత్ చేయాల్సిన ప్రయత్నాలు ఏమిటి? అవసరానికి తగిన రీతిలో ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు, సాంకేతి రంగం లో ఎదురవుతున్న సమస్యలు, ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం, మాంద్యం పరిస్థితులు, సమస్యలను సమర్థంగా ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన మార్గాలు వం టి అనేక కీలక అంశాలపై సదస్సులో దృష్టి కేంద్రీకరిస్తారు.
వివిధ రంగాల్లో భారత భవిష్యత్తును నిర్దేశించే రీతిలో ఈ సదస్సు ఎలాంటి తీర్మానాలను ఆమోదిస్తుంది? ఏఏ ప్రతిపాదనలు చేస్తుంది? అనేది ఉత్కంఠ రేపుతున్నది.