జాతీయ వార్తలు

ఈశాన్య ఢిల్లీ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 1: అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీ క్రమంగా తేరుకుంటోంది. అలాగని.. ఉద్రిక్త పరిస్థితులు పూర్తిగా సడలినట్లు చెప్పలేని విధంగా పరిస్థితులు ఉన్నాయి. అయితే, గత మూడు రోజులుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. యావత్ ఈశాన్య ఢిల్లీ అంతటా కట్టుదిట్టమైన భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఆదివారం ప్రధాన రోడ్లపై కొంతమంది నిరసనకారులు మోటారు వాహనాలపై ర్యాలీలు తీయడం గమనార్హం. ‘ప్రస్తుతం ఈశాన్య ఢిల్లీ జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొంది.. పరిస్థితి అదుపులోనే ఉంది.. సరిపడినంతగా బందోబస్తును మోహరింపజేశాం.. సామాన్య పరిస్థితులు నెలకొనే విధంగా.. ప్రజల్లో విశ్వాసం నెలకొనేలా చేసేందుకు స్థానికులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం’ అని సీనియర్ పోలీసు అధికారుల వెల్లడించారు. పుకార్లను నమ్మవద్దనీ.. ఎలాంటి అనుమానం కలిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈశాన్య ఢిల్లీలో మత ఘర్షణలు చోటుచేసుకొన్న ప్రాంతాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ పర్యటించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకొన్నారు. ఇక్కడి బ్రాహ్మణపురితో పాటు మత ఘర్షణలు జరిగిన పలు ప్రాంతాల్లో రవిశంకర్ పర్యటించారు. ‘అల్లర్ల కారణంగా అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది.. గాయపడిన అనేకమంది సాధారణ జీవనం సాగించే విధంగా చొరవ తీసుకొంటున్నాం.. ప్రతి ఒక్కరూ యథావిధిగా సాధారణ జీవనం సాగించాలని కోరుతున్నాం’ అని రవిశంకర్ విలేఖరులకు చెప్పారు. ‘అల్లర్లలో బాధితులను రక్షించడానికి చొరవ చూపిన స్థానికులను చూసి మనం చాలా నేర్చుకోవాలి.. మానవత్వం ఇంకా బతికే ఉందని చాలామంది నిరూపించుకొన్నారు.. అసాంఘిక శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు.. కఠినంగా శిక్షించాలి’ అని రవిశంకర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మత ఘర్షణలు జరిగిన జఫరాబాద్, వౌజ్‌పూర్, బాబర్‌పూర్, చాంద్‌బాగ్, శివ్ విహార్, భజన్‌పుర, యమునా విహార్, ముస్త్ఫాబాద్ ప్రాంతాల్లో 42మంది మరణించగా 200మందికి పైగా గాయాలయ్యాయి. శివ్‌విహార్, ముస్త్ఫబాద్ అల్లర్లకు భయపడి ఆయా ప్రాంతాలను ఖాళీ చేసే వేరే ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు. ‘పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ ఉద్రిక్త వాతావరణం అలాగే ఉంది.. గతంలో ఈద్, హోలీ, దీపావళి బాగానే జరుపుకొన్నాం.. ఇలాంటి పరిస్థితిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు’ అని 45 ఏళ్ల మొహ్మద్ యూనస్ పేర్కొన్నాడు. యూనస్ శివ్‌విహార్‌లో బట్టల షాపును నిర్వహిస్తున్నాడు. అల్లర్ల సందర్భంలో స్థానికులు యూనస్‌ను రక్షించారు.. అల్లర్లలో బట్టల దుకాణానికి చెందిన బోర్డును ధ్వంసం చేశారు.. ఘర్షణల్లో తీవ్ర గాయాలైన డీసీపీ అమిత్‌శర్మ పట్పర్‌గంజ్ ప్రాంతంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్‌ఎన్ శ్రీవాత్సవ.. మత ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన డీసీపీ అమిత్‌శర్మను పరామర్శించి ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకొన్నారు. ఘర్షణల్లో గాయపడిన శర్మ మెదడుకు శస్తచ్రికిత్స నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలో శాంతి భద్రతలను పరిరక్షించడమే ధ్యేయమని, మత ఘర్షణలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకొన్నట్లు సీపీ శ్రీవాత్సవ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.