జాతీయ వార్తలు

అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, మార్చి 1: అంతర్జాతీయ మార్కెట్లో దేశీయ కళలు, చేతివృత్తులకు తగిన గుర్తింపు వచ్చేలా కేంద్రంలోని తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఆదివారంనాడు ఇక్కడ తెలిపారు. ఇక్కడి హర్మో మైదానంల హూనార్ హాట్ ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఆయన ‘ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్‌లో దేశీయ ఉత్పత్తులకు, కళాకారుల నైపుణ్యాన్ని గుర్తించేందుకు ఏర్పాటు చేశాం. వీరంతా ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు’ అని తెలిపారు. దేశీయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లో తీసుకెళ్లేందుకు అనేక అభివృద్ధి కౌన్సిళ్లతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన తెలిపారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన హూనార్ హాట్‌ను సందర్శించడం దేశీయ కళాకారులకు, చేతివృత్తి నిపుణులకు, ముఖ్యంగా మహిళలకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించిందని నఖ్వీ తెలిపారు. రాంచీలో హూనార్ హాట్‌ను మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోందని, ఈనెల 28 వరకు ఇది కొనసాగుతుందని ఆయన తెలిపారు. గతనెల 23న చేసిన మన్ కీ బాత్ ప్రసంగంలో హూనార్ హాట్‌ల గురించి మోదీ ప్రస్తావించారని, దేశీయ కళలు, చేతివృత్తులను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారని నఖ్వీ గుర్తు చేశారు. న్యూఢిల్లీలో హూనార్ హాట్‌ను మోదీ సందర్శించిన తర్వాత దేశ విదేశాలకు చెందిన 17 లక్షల మంది దీనిని సందర్శించారని నఖ్వీ వెల్లడించారు. అక్కడి కళాకారులను ప్రోత్సహించడమే కాకుండా వివిధ రాష్ట్రాల ప్రత్యేకమైన వంటకాలను కూడా ఆస్వాదించారని నఖ్వీ తెలిపారు. రాంచీలో ప్రారంభించిన ఈ శిబిరంలో 125 స్టాల్స్ ఉన్నాయని, దేశవ్యాప్తంగా 250 మంది వివిధ వృత్తులకు చెందిన నిపుణులు తమ ఉత్పత్తులను వీటిలో ప్రదర్శిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ రకమైన హూనార్ హాట్‌ల ద్వారా గత మూడేళ్లలో మూడు లక్షల మందికి పైగా కళాకారులు, చేతివృత్తి నిపుణులు, వంటల నిపుణులకు ఉపాధి లభించడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా మెరుగయ్యాయని మంత్రి నఖ్వీ తెలిపారు. ఈనెల 13 నుంచి 22 వరకు తదుపరి హూనార్ హాట్‌ను చండీగఢ్‌లో ప్రారంభిస్తామని అన్నారు. ఆర్థిక అభివృద్ధి స్రవంతిలో ప్రతిఒక్కరూ పాలుపంచుకునేలా కేంద్రం చేపట్టిన చర్యలు ఎంతగానో తోడ్పడుతున్నాయని పేర్కొన్న సుసంపన్నమైన భారతీయ సంస్కృతి వారసత్వాన్ని ఒకే గొడుగు కింద ఆవిష్కరించడానికి హూనార్ హాట్‌లు బలమైన వేదికలు అవుతున్నాయని ఆయన అన్నారు.
*చిత్రం... మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ