జాతీయ వార్తలు

ముందు ఢిల్లీని చక్కదిద్దండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 1: మమతా బెనర్జీ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం జరిగిన ర్యాలీలో విమర్శలు గుప్పించడంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తింది. ‘పశ్చిమ బెంగాల్‌లో శాంతి భద్రతల పరిరక్షణ మాకు తెలుసు. ముందు ఢిల్లీ పరిస్థితిని చక్కదిద్దండి’ అంటూ అమిత్ షాకు హితవు పలికింది. ఢిల్లీ హింసాకాండలో 42 మంది మరణించడానికి దారితీసిన పరిస్థితులకు అమిత్ షా బాధ్యత వహించాలని, ప్రజల ప్రాణాలను కాపాడలేకపోయినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. పశ్చిమ బెంగాల్ అన్నివిధాలుగా ప్రశాంతంగా ఉందని, కానీ బీజేపీ నాయకత్వం వైషమ్యాలను, విద్వేషాలను రెచ్చగొడుతోందని టీఎంసీ సీనియర్ నాయకుడు అభిషేక్ బెనర్జీ అన్నారు. శాంతి భద్రతలపై బెంగాల్‌కు పాఠాలు చెప్పే బదులు ఢిల్లీలో జరిగిన దానికి క్షమాపణ చెప్పాలని అమిత్ షాను ఆయన డిమాండ్ చేశారు.
గో బ్యాక్ అంటూ ప్రదర్శనలు
కోల్‌కతా: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనకు నిరసనగా ఆదివారం కోల్‌కతాలో కాంగ్రెస్, సీపీఎం పార్టీలు ర్యాలీలు నిర్వహించాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ రెండు పార్టీలు నిర్వహించిన ర్యాలీల్లో వందలాది మంది పాల్గొన్నారు. నల్లజెండాలు పట్టుకుని పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈ పార్టీల కార్యకర్తలు నినాదాలు చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ప్రదర్శన చేపట్టి అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అమిత్ షా ర్యాలీ జరుగుతున్న ప్రాంతంలో కూడా ఈ పార్టీల కార్యకర్తలు చొచ్చుకొచ్చే ప్రయత్నం చేయడంతో పోలీసులతో స్వల్ప ఘర్షణ జరిగింది. కొన్నిచోట్ల అమిత్ షా దిష్టిబొమ్మలను కూడా దగ్ధం చేశారు.