జాతీయ వార్తలు

శరణార్థులందరికీ పౌరసత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 1: పొరుగున ఉన్న మూడు దేశాల శరణార్థులకు పౌర చట్టాన్ని కల్పించాలన్న తమ ప్రభుత్వ నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంతమాత్రం అడ్డుకోలేరని కేంద్ర హోం మం త్రి అమిత్ షా ఆదివారం నాడు ఇక్కడ జరిగిన ఓ భారీ ర్యాలీలో స్పష్టం చేశారు. దేశంలోని శరణార్థులందరికీ పౌరసత్వాన్ని కల్పిం చే వరకూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విశ్రమించే ప్రస క్తే లేదని ఆయన అన్నారు. పశ్చి మ బెంగాల్ అసెంబ్లీకి వచ్చే ఏడా ది జరుగనున్న ఎన్నికల్లో మూడిం ట రెండు వంతుల మెజారిటీతో బీజేపీ అధికారంలో వస్తుందని
అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని శరణార్థులు, మైనారిటీలను రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. పౌరసత్వ చట్టం వల్ల దేశంలోని ఏ పౌరుడి పౌరసత్వం తొలగిపోదని ఆయన ఉద్ఘాటించారు. ఈ చట్టంలో ఈ విషయం చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం మైనారిటీలను భయోత్పాతానికి గురిచేస్తున్నాయని ఆరోపించిన ఆయన ‘మైనారిటీలు ఈ చట్టం పట్ల ఏవిధంగానూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది పౌరసత్వాన్ని కల్పించేదే తప్ప లాక్కునేది కాదు’ అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీఏఏను వ్యతిరేకించడం ద్వారా పశ్చిమ బెంగాల్‌లో అల్లర్లకు ఊతాన్ని ఇచ్చారని ఆయన అన్నారు. మమతా బెనర్జీ ఎంతగా వ్యతిరేక ప్రచారం చేసినా అల్లర్లను, రైళ్లు తగలబెట్టడాన్ని ప్రోత్సహించినా ఈ చట్టాన్ని ఎంతమాత్రం అడ్డుకోలేరని తెలిపారు. అయితే, ఈ రకమైన ప్రతికూల ప్రచారం ద్వారా మమతా బెనర్జీ శరణార్థుల ప్రయోజనానికి భంగం కలిగిస్తున్నారని అన్నారు. దేశంలోని ఏ పౌరుడూ ఈ చట్టం నిజాయితీని సందేశించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ సందర్భంగా ‘ఇంకెంతమాత్రం అన్యాయం సాగదు’ అన్న ప్రచారాన్ని కూడా ఈ ర్యాలీలో ఆయన ప్రారంభించారు. అయోధ్యలో కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే అత్యంత అద్భుతమైన రీతిలో రామాలయం ఆవిష్కృతం కాబోతోందని అమిత్ షా తెలిపారు. విమానాశ్రయం నుంచి అమిత్ షా ర్యాలీ జరిగిన మైదానం వరకు జరిగిన ప్రదర్శనలో బీజేపీ కార్యకర్తలు ‘గోలీ మారో’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు 18 సీట్లను బీజేపీకి అప్పగించారని గుర్తు చేసిన అమిత్ షా ‘మాకు డిపాజిట్లు కూడా రావని అప్పట్లో మమతా బెనర్జీ అన్నారు. కానీ ఆమె అంచనాలు తలకిందులు చేస్తూ 18 సీట్లు గెలుపొందాం. ఆ విధంగా 2 కోట్లకు పైగా బెంగాల్ ఓట్లను బీజేపీ కైవశం చేసుకుంది. 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ మాదే స్పష్టమైన మెజారిటీ’ అని అమిత్ షా అన్నారు.

*చిత్రం... కోల్‌కతాలో ఆదివారం జరిగిన ర్యాలీలో మాట్లాడుతున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా