జాతీయ వార్తలు

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించొద్దు: భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: స్వతంత్ర, సార్వభౌమ, ప్రజాస్వామిక, సంఘటిత అఫ్గానిస్తాన్‌కు భారత్ మద్దతు ఇస్తుందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రీంగ్లా అఫ్గానిస్తాన్ నాయకత్వానికి తెలియజేశారు. అఫ్గానిస్తాన్‌లో సుస్థిరమయిన శాంతి నెలకొనాలంటే బయటి నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, మద్దతు ఇవ్వడం నిలిచిపోవాలని ఆయన సూచించారు. శ్రీంగ్లా రెండు రోజుల అధికారిక పర్యటన కోసం శుక్రవారం కాబూల్‌కు చేరుకున్నారు. ఆయన ఈ పర్యటనలో అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అబ్దుల్లా అబ్దుల్లా, వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయిన అమ్రుల్లా సలేహ్, జాతీయ భద్రతా సలహాదారు హమ్‌దుల్లా మోహిబ్‌తో చర్చలు జరుపుతారు.