జాతీయ వార్తలు

ఢిల్లీ ఇంకా ఉద్రిక్తమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27:్ఢల్లీ పరిస్థితి నివురుగప్పిన నిప్పుచందంగా ఉంది. గత మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని రీతిలో చోటుచేసుకున్న అల్లర్లలో మృతుల సంఖ్య 34కు చేరింది. ప్రభుత్వం తీసుకున్న అత్యవసర భద్రతా చర్యల వల్ల పరిస్థితి కొంత మేర సద్దుమణిగినట్టు కనిపిస్తున్నప్పటికీ పూర్తిగా అదుపులోకి రాలేదు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం మొదలైన అల్లర్లు రోజురోజుకూ తీవ్రమవుతూ నగరవాసుల జీవనాన్ని అతలాకుతలం చేశాయి. అల్లర్లతో పాటు దోపిడీలు, దొంగతనాలు కూడా జరగడం జనం అవాక్కయిపోయారు. వౌజ్‌పూర్, భజన్‌పురా వంటి కొన్ని చోట్ల తాజాగా విధ్వంసకాండ చోటుచేసుకుంది. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇటు జవాన్లు, అటు పౌర సంఘాలు శాంతియాత్ర నిర్వహించాయి.

*చిత్రం... నూతన పౌరసత్వ చట్టంపై జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలోని
యమునా విహార్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది.