జాతీయ వార్తలు

సర్జికల్ స్ట్రైక్స్ గురించి చెబుతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింద్వారా (మధ్యప్రదేశ్), ఫిబ్రవరి 20: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏదో సాధించామని చెప్పుకొంటూ వస్తున్న మీరు ‘సర్జికల్ స్ట్రైక్స్’ గురించి కొంచెం ప్రజలకు వివరించగలరా? అని ప్రశ్నించారు. ‘నిరుద్యోగ యువత, రైతు ఆత్మహత్యలను మీరు ఎందుకు ప్రస్తావించడం లేదు.. మీ పార్టీ తరఫు నుంచి ఒక్క స్వాతంత్య్ర సమరయోధుడిని చూపించండి చూద్దాం’ అని మోదీని కమల్‌నాథ్ సవాలు విసిరారు. గురువారం చింద్వారా సమీపంలోని ఉమర్హర్ గ్రామంలో సంచార పశువుల కోసం నిర్మించిన షెల్టర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమల్‌నాథ్ మాట్లాడుతూ ‘ఆయన (మోదీ) సర్జికల్ స్ట్రయిక్స్‌ను చేయించగలిగానని చెబుతున్నారు.. అసలు సర్జికల్ స్ట్రయిక్ అంటే ఏమిటో కొంచెం ప్రజలకు వివరిస్తారా? మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ హయాంలో 90వేల మంది పాక్ జవాన్లు లొంగిపోయారు.. ఇవేమైనా మీకు గుర్తున్నాయా? మీరు వాటి గురించి మాట్లాడరు’ అంటూ మోదీపై విరుచుకుపడ్డారు. ‘దేశ ప్రజలకు సర్జికల్ స్ట్రయిక్స్ గురించి కొంచెం చెప్పండి.. మీ పార్టీలో ఒక్క స్వాతంత్య్ర సమరయోధుడు లేడు’ అని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘ఎంతసేపూ ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తున్నారు.. ఇందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు.. మీ కపట నాటకాలు ఇక ఎంతోకాలం సాగవు.. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ప్రజలు మీ పరిపాలనను గమనించినట్లు రుజువు అవుతోంది’ గమనించండి అంటూ మోదీకి హితవు పలికారు. ప్రజలను ఒక్కసారి మాత్రమే మోసం చేయగలరు.. మళ్లీ మళ్లీ అలా చేయలేరు.. దేశ భవితకు కీలకమైన యువత భవిష్యత్ పెద్ద సవాలుగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ‘మీరు యువత గురించి మాట్లాడడం లేదు.. రైతు ఆత్మహత్యలను ప్రస్తావించడం లేదు.. గత ఆరు నెలల్లో ఎక్కడైనా వీరి గురించి మాట్లాడారా’ అని మోదీని ప్రశ్నించారు. ‘మోదీ రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్నారు.. కనీసం రెండు లక్షల మందికి కూడా ఉద్యోగాలు చూపించలేకపోయారు.. వ్యవసాయాన్ని లాభసాటి చేస్తామని చెప్పడమే తప్ప వారి ఆత్మహత్యలు మీకు ఏమాత్రం పట్టడం లేదు’ అని సీఎం పేర్కొన్నారు.
*చిత్రం... మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్