జాతీయ వార్తలు

తుది శ్వాస వరకూ కార్మిక సేవలోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 18: ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ జీ. సంజీవరెడ్డి 90వ జన్మదిన వేడుకలు చెన్నైలో మంగళవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఐఎన్‌టీయూసీ తమిళనాడు అధ్యక్షుడు జగన్నాధం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వివిధ రాష్ట్రాల నుంచి కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తన సతీమణి పద్మావతితో కలిసి సంజీవరెడ్డి కేక్ కట్ చేశారు. జన్మదిన వేడుకలకు విచ్చేసిన అశేష కార్మికలోకాన్ని ఉద్దేశించి సంజీవరెడ్డి మాట్లాడుతూ తుది శ్వాస వరకు కార్మిక సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని భరోసా ఇచ్చారు. ‘70 సంవత్సరాల క్రితం కార్మికులు కేవలం తిండి పెడితే చాలు అనే రీతిలో పనిచేసే వారు.. మారుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా మంచి వేతనం వచ్చే విధంగా తాను యాజమాన్యాలతో పోరాడి సాధించగలిగాను’ అని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాసే విధంగా పనిచేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యల కారణంగా కార్మికుల్లో ఉద్యోగ భద్రత కరువౌందనీ.. వెట్టి చాకిరీ చేయాల్సిన దుస్థితి తలెత్తుతోందని అన్నారు. వయస్సు మీద పడుతున్నప్పటికీ కార్మికుల సంక్షేమమే తన ధ్యేయమన్నారు. తుది శ్వాస వరకూ వారి సేవలో తరించడమే తన జీవిత పరమార్థంగా భావిస్తున్నానని కార్మికులు, నాయకుల హర్షధ్వానాల మధ్య సంజీవరెడ్డి పేర్కొన్నారు.
*చిత్రం... చెన్నైలో మంగళవారం 90వ జన్మదిన వేడుకల్లో భాగంగా తన సతీమణి పద్మావతికి కేక్ తినిపిస్తున్న ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు జీ. సంజీవ రెడ్డి