జాతీయ వార్తలు

అహ్మద్ పటేల్‌కు ఐటీ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ కోశాధికారి అహ్మద్ పటేల్‌కు ఐటీ షాక్ తగిలింది. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆంధ్రా నుంచి హవాలా రూపంలో కాంగ్రెస్ పార్టీకి తరలి వచ్చిన 400 కోట్ల రూపాయలకు సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు రావాలంటూ ఆదాయం పన్ను శాఖ నుంచి నోటీసులు ఆయన కు నోటీసులు జారీ అయ్యారు. దీంతో కాంగ్రెస్ కోశాధికారి అహ్మద్ పటేల్ నలతగా ఉందంటూ ఆసుపత్రిలో చేరిపోయారు. తనకు శ్వాస సంబంధమైన సమస్యలున్నాయంటూ ఫరిదాబాద్‌లోని మెట్రో ఆసుపత్రిలో చేరాను. కాబట్టి ఇప్పటికిప్పుడు విచారణకు హాజరు కాలేనంటూ అహ్మద్‌పటేల్ ఆదాయం పన్ను శాఖకు సందేశం పంపించారు. ఆదాయం పన్ను శాఖ కొంత కాలం క్రితం హైదరాబాద్‌లోని పలువురు ప్రముఖులు, ఒక పెద్ద నిర్మాణ సంస్థపై దాడులు చేసినప్పుడు లభించిన పత్రాలు ఆంధ్రా నుంచి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు హవాలా మార్గంలో కాంగ్రెస్‌కు చేరినట్లు బయటపడింది. ఈ నాలుగు వందల కోట్ల హవాలా డబ్బు గురించి సమాచారం ఇచ్చేందుకు తమ ముందు హాజరు కావాలని ఆదాయం పన్ను శాఖ కాంగ్రెస్ కోశాధికారి అహ్మద్‌పటేల్‌కు ఇటీవల నోటీసులు జారీ చేసింది. మొదట ఫిబ్రవరి 11 తేదీ నాడు జారీ చేసిన సమన్ల ప్రకారం ఆయన ఫిబ్రవరి 14 తేదీనాడు ఆదాయం పన్ను శాఖ అధికారుల ముందు హాజరు కావలసి ఉంది. అయితే ఆయన మాత్రం 14 తేదీనాడు ఆదాయం పన్ను ఆధికారుల ముందు హాజరు కాకుండా తప్పించుకున్నారు. దీంతో ఆదాయం పన్ను శాఖ రెండో సారి సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 18 తేదీనాడు తప్పకుండా హాజరు కావాలని లేని పక్షంలో తగు పరిణామాలను ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరించింది. విచారణకు హాజరయ్యేందుకు ఆదాయం పన్ను శాఖ కార్యాలయానికి వెళితే అరెస్టు చేస్తారని భయపడిన అహ్మద్‌పటేల్ మంగళవారం నేరుగా ఫరిదాబాద్‌లోని మెట్రో ఆసుపత్రికి వెళ్లి తనకు శ్వాస ఆడటం లేదంటూ ఆసుపత్రిలో చేరిపోయారు. శ్వాస సంబంధ సమస్యతో ఆసుపత్రిలో చేరినందున విచారణకు హాజరు కాలేనంటూ ఐటీ శాఖ అధికారులకు ఆసుపత్రి రసీదులతోపాటు లేఖ పంపించారు. తెలుగుదేశం హయాంలో అమరావతిలో భారీ నిర్మాణం పనులు చేపట్టిన ఒక సంస్థ నుంచి దాదాపు 400 కోట్ల రూపాయలు అధికార పార్టీ నాయకుల ద్వారా కర్నాటకలోని బెంగళూరుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడి ద్వారా ఢిల్లీలోని సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి చేరాయని కొంత కాలం క్రితం ఐటీ, ఈడీ పత్రికా ముఖంగా వెళ్లడించిన సంగతి తెలిసిందే. ఈ హవాలా వ్యవహారంతో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సంబంధం ఉందనే వార్తలు రావటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ఇటీవల చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ నివాసంపై దాడి చేసి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన రికార్డులు ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదాయం పన్ను శాఖ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్‌ను విచారణకు పిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అహ్మద్ పటేల్ హవాలా నిధులకు సంబంధించిన వివరాలను ఉన్నది ఉన్నట్టు వెల్లడించే పక్షంలో కొందరు ఆంధ్రా, అలాగే పలువురు జాతీయ నాయకులు ఇబ్బందుల్లో పడడం ఖాయం.
*చిత్రం... కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ కోశాధికారి అహ్మద్ పటేల్‌