జాతీయ వార్తలు

అనుమతిస్తే షాను కలుస్తాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/చెన్నై, ఫిబ్రవరి 16: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇటు ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లోనూ, అటు చైన్నైలోనూ ముస్లిం మహిళల నిరసన రోజు, రోజుకూ తీవ్రమవుతోంది. షషీన్‌బాగ్‌లో గత కొన్ని వారాలుగా నిరసన ప్రదర్శన జరుపుతున్న ఆందోళనకారులు అధికారుల అనుమతి తీసుకుని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంటికి కూడా ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. ఆయనతో వివాదస్పద పౌరసత్వ చట్టంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం దక్షిణ-ఈశాన్య ఢిల్లీలోని షషీన్‌బాగ్‌లో మహిళా నిరసనకారులు పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. నిరసనకారులు హోం మంత్రి అమిత్ షా నివాసం వైపు వెళ్ళకుండా పోలీసు ఉన్నతాధికారులు షహీన్‌బాగ్ వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేయించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలాఉండగా తమను అనుమతించకపోయినా, 8 మంది సభ్యుల బృందాన్ని అనుమతించాలని నిరసనకారులు పోలీసు అధికారులను కోరారు. తమ బృందంలో షహీన్‌బాగ్‌లో దీదీగా పిలువబడే ఒక వృద్ధ మహిళ కూడా ఉంటారని వారు చెప్పారు. తమ ఎనిమిది మందికి అనుమతి ఇస్తే ప్రశాంతంగా హోం మంత్రి నివాసానికి వెళతామని, మిగతా వారంతా ఇక్కడే ఉండిపోతారని వారు పోలీసులకు వివరించారు. అయితే పోలీసులు వారిని అనుమతించలేదు. కాగా ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి, తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని నిరసనకారులకు పోలీసులు చెప్పారు. నిరసనకారుల నిర్వాహకుడు జావెద్ ఖాన్ మాట్లాడుతూ హోం మంత్రి షాను కలిసేందుకు తమకు అనుమతి లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ అనుమతి రాకపోతే తమ భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. నిరసనకారులు అనుమతి కోసం హోం మంత్రి నివాసం నుంచి, పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇదిలాఉండగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చెన్నైలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పాత వాషర్‌మాన్ పేట్ ప్రాంతంలో ముస్లింలు మూడో రోజు తమ నిరసన ప్రదర్శనలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో శాంతి-్భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ ఉన్నతాధికారులను ఆదేశించింది.
*చిత్రం...సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో నిరసన తెలియజేస్తున్న మహిళలు ఆదివారం త్రివర్ణ పతాకంతో ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు