జాతీయ వార్తలు

సీఏఏను రద్దు చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 15: పెద్ద సంఖ్యలో మహిళలు సహా వేలాది మంది ప్రజలు శనివారం ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో సీఏఏ-ఎన్‌ఆర్‌సీ-ఎన్‌పీఆర్‌లను ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఉర్దూ కవి ఫరుూజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ప్రాచుర్యం పొందిన కవిత ‘హమ్ దేఖేంగే’ను పఠిస్తుండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను వ్యతిరేకిస్తూ చేస్తున్న నినాదాల మధ్య వారంతా సీఏఏ-ఎన్‌ఆర్‌సీ-ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా పోరాడుతామని తెగేసి చెప్పారు. ‘జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ప్రతిపాదిత జాతీయ పౌర రిజిస్టరు (ఎన్‌ఆర్‌సీ), జాతీయ జనాభా రిజిస్టరు (ఎన్‌పీఆర్)ల వ్యితిరేక జాతీయ కూటమి’ ఈ ‘మహా మోర్చా’ నిరసన ప్రదర్శనను నిర్వహించింది. ముంబయి నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు నవీ ముంబయి, థానే వంటి ముంబయి శివారు ప్రాంతాలు, మహారాష్టల్రోని ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ఆజాద్ మైదాన్‌కు తరలివచ్చారు. త్రివర్ణ పతాకాలను, సీఏఏ-ఎన్‌ఆర్‌సీ-ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా రాసిన బ్యానర్లను చేతబూనిన ప్రదర్శకులు ‘మోదీ, షా సే ఆజాదీ’ (పీఎం మోదీ, షాల నుంచి విముక్తి కావాలి), ‘సీఏఏ, ఎన్‌ఆర్‌సీల నుంచి విముక్తి కావాలి’ అంటూ నినాదాలు చేశారు. ఎన్‌పీఆర్, ఇతర కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి పత్రాలు చూపించొద్దని ప్రదర్శకులు గట్టిగా తీర్మానించుకున్నారు. తాము అనాది కాలం నుంచి భారత పౌరులమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఏఏ-ఎన్‌ఆర్‌సీ-ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా తీర్మానాలు ఆమోదించారు. కొత్త పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలోనే రద్దు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆజాద్ మైదాన్‌లోని వేదికపై ఉన్న ఉపన్యాసకులు ఉర్దూ కవి ఫరుూజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ప్రసిద్ధి పొందిన కవిత ‘హమ్ దేఖేంగే’ (మేము చూస్తాం)ను చదివారు. ఈ నిరసన ప్రదర్శన కన్వీనర్ జస్టిస్ (రిటైర్డ్) కోల్సే పాటిల్, సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, నటుడు సుశాంత్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అబు అసీం అజ్మీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
*చిత్రం...ముంబయలోని రామ్‌లీలా మైదానంలో ఎన్‌ఆర్‌సీ, సీఏఏలకు వ్యతిరేకంగా శనివారం జరిగిన భారీ ప్రదర్శన