జాతీయ వార్తలు

‘మహా’లో ఆకలి రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 11: మహారాష్టలో మొన్నటి వరకు మిత్రపక్షాలుగా కొనసాగి, తాజాగా శతృ పక్షాలైన అధికార శివసేన, ప్రతిపక్ష బీజేపీ ఇప్పుడు పేద ప్రజలను ఆకర్షించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఆకలితో అలమటించే పేద ప్రజలకు తమ ప్రభుత్వం పసందైన భోజనం పెడుతుందని లోగడ ప్రకటించిన శివసేన సంకీర్ణ ప్రభుత్వం, చెప్పినట్లుగానే గణతంత్ర దినోత్సవం (జనవరి 26) రోజున రూ.10కే థాలీని (్భజనం) అందుబాటులోకి తెచ్చింది. అయితే మాజీ మిత్రపక్షమైన బీజేపీ ఒక అడుగు ముందుకేసి ‘మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. అయితే ‘శివ భోజన్’ కంటే కూడా తమ భోజనం వంద రేట్లు బాగా ఉంటుందని బీజేపీ ఢంకా బజాయించి ప్రకటించింది. దీనికి ‘్ధన్‌దయాల్’ థాలీ అని పేరు పెట్టింది. రూ.30కి అందించే ఈ మధ్యాహ్న భోజనం థాలీ (ప్లేట్)లో మూడు చపాతీలు, గినె్నలో అన్నం, రెండు ఆకు-కూరగాయల కూరలు, వేరు శనగ చట్నీ, మామిడి పచ్చడి ఇస్తామని బీజేపీ ప్రకటించింది. కాగా గత నెల 26న శివసేన ‘శివ భోజన్’ పేరిట ప్రారంభించిన తాలీలో రెండు చపాతీలు, ఒక ఆకుకూర, 150 గ్రాముల అన్నం, పప్పు ఉన్నాయి. ఇదిలాఉండగా తమ పార్టీలోని మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించినట్లు బీజేపీ వెల్లడించింది. తొలుత షోలాపూర్ జిల్లాలో పందర్‌పూర్‌లో గల పేరెన్నికగన్న విఠల్ ఆలయం వద్ద దీనిని ప్రారంభించింది. త్వరలో జిల్లా మొత్తం ఈ పథకాన్ని విస్తరిస్తామని పార్టీ ప్రకటించింది. మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర మంత్రి అస్లం షేక్ మీడియాతో మాట్లాడుతూ ఇలా కాపీ కొట్టడం బీజేపీకి అలవాటేనని విమర్శించారు. కాగా బీజేపీ అధికార ప్రతినిధి మాధవ్ భండారీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి షేక్ చేసిన విమర్శను తోసిపుచ్చారు. తాము లోగడ ‘అటల్ థాలీ పథకాన్ని’ ప్రారంభించామని గుర్తు చేశారు. ఇలా అధికార శివసేన, ప్రతిపక్ష బీజేపీ పోటీ పడుతున్నా, పేదలు మాత్రం తమకు చౌకగా భోజనం లభిస్తున్నదన్న సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.