జాతీయ వార్తలు

బ్రిటిషర్లకే వెరవలేదు.. మీకెందుకు భయపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జామియా మిలియా విద్యార్థులు, ప్రజలు తలపెట్టిన ర్యాలీ స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. జామియా విద్యార్థులు, పూర్వ విద్యార్థులకు చెందిన జామియా కోఆర్డినేషన్ కమిటీ (జేసీసీ) ఆధ్వర్యంలో సీఏఏను వ్యతిరేకిస్తూ జామియా నుంచి పార్లమెంట్ వరకు సోమవారం ప్రదర్శన తలపెట్టారు. సమాచారం అందుకొన్న ప్రభుత్వం భారీ ఎత్తున యూనివర్సిటీ నలువైపుల నుంచి పార్లమెంట్ వరకు బలగాలను మోహరించింది. ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదు అని విద్యార్థులను హెచ్చరించారు. ఆమేరకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ వాటిని దాటుకొంటూ విద్యార్థులు చొచ్చుకువెళ్లారు. అనుమతి లేదని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా విద్యార్థులు పట్టించుకోలేదు. దీంతో విద్యార్థులు, పోలీసులకు మధ్య స్వల్ప ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకొంది. ర్యాలీ జామియా ఏడో గేటు నుంచి ప్రారంభించారు. ‘మేం డాక్యుమెంట్లను ప్రదర్శించడం లేదు’, ‘అప్పట్లో బ్రిటిష్ వాళ్లకే భయపడలేదు.. మీకెందుకు భయపడాలి’ అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శన మొదలు పెట్టారు. వేలాది మంది రోడ్డుకు ఇరువైపులా మానవహారంగా ఏర్పడి ర్యాలీని ప్రారంభించగా.. మహిళలు వారి ముందు నడిచారు. ర్యాలీ కొంతవరకు సాగినా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకొన్నాయి. ‘గత రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం కనీసం మాతో మాట్లాడేందుకు కూడా ముందుకు రాలేదు.. అందుకే పార్లమెంట్‌కు వెళ్లి వారితో నేరుగా మాట్లాడాలని నిర్ణయించాం’ అంటూ బుర్ఖా ధరించిన జెబా అన్హద్ అనే యువతి స్పష్టం చేసింది. జామియాకు చెందిన ఓ అధికారి విద్యార్థుల వద్దకు వచ్చి ‘చట్టాన్ని గౌరవిద్దాం.. పోలీసులతో తలపడేందుకు ప్రయత్నించవద్దు’ అంటూ విజ్ఞప్తి చేశారు. ‘మీ సందేశాన్ని పంపించాం.. మీరంతా శాంతియుతంగా యూనివర్సిటీలోకి వెళ్లిపోవాలని కోరుతున్నా’ అంటూ ఆయన సూచించారు. పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మతపరమైన వివక్షను ఎదుర్కొన్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు, పార్శీలు, జైన్‌లకు సులువుగా పౌరసత్వం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే చట్టాన్ని తీసుకొచ్చామని పదేపదే కేంద్ర ప్రభుత్వం చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే, రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందనీ.. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. సీఏఏ, ఎన్నార్సీల కారణంగా తమకు అన్యాయం జరుగుతుందనీ.. తమను లక్ష్యంగా చేసుకొనే చట్టాన్ని తీసుకొచ్చారని ముస్లిం వర్గాలు ఆరోపిస్తున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఆరోపణలు ఖండిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రచారాన్ని సైతం చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే.

*చిత్రం... ఆందోళనకారులను అడ్డుకుంటున్న పోలీసులు