జాతీయ వార్తలు

మలేరియాను నిర్మూలిద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: దేశంలో మలేరియాను సమూలంగా నిర్మూలించేందుకు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు చేతులు కలిపారు. 2030 సంవత్సరం నాటికి సమూలంగా నిర్మించాలన్న ప్రభుత్వ సంకల్పానికి తమ వంతు సహకారం అందించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీలు తెలిపారు. ఎంపీలు కేజే అల్పాన్స్ (బీజేపీ, రాజస్థాన్), గౌరవ్ గంగోయి (కాంగ్రెస్, అస్సాం), ప్రభాకర్ కొరె (బీజేపీ, కర్నాటక), అమర్ పట్నాయక్ (బిజూ జనతాదళ్, ఒడిశా), డాక్టర్ వికాస్ మహాత్మ (బీజేపీ, మహారాష్ట్ర), సంజయ్ జైస్వాల్ (బీజేపీ, బీహార్) ఉన్నారు. తమ బృందంలో ఇంకా చాలా మంది ఎంపీలు చేరే అవకాశం ఉందని ఎంపీల బృందానికి సమన్వయం చేస్తున్న కో-ఆర్డినేటర్ అల్ఫాన్స్ తెలిపారు. మలేరియా నిర్మూలించేందుకు చేపట్టన చర్యలు బాగున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) గత ఏడాది ప్రకటించిన మలేరియా నివేదికలో పేర్కొంది. గిరిజన ప్రాంతాలు, అటవీ, పర్వత సరిహద్దు ప్రాంతాల ప్రజలు మలేరియా బారిన పడుతున్నారని డబ్ల్యుహెచ్‌ఓ తెలిపింది.