జాతీయ వార్తలు

మమత సర్కార్ ఎన్నికల బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఫిబ్రవరి 10: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సోమవారం జనాకర్షక బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఉపాధి కల్పనకు ఊతాన్నిస్తూ అనేక ప్రతిపాదనలు చేసింది. రానున్న మూడేళ్ళ కాలంలో రాష్ట్రంలో వంద ఎంఎస్‌ఎంఇ పార్కులను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. త్రైమాసికంగా 75 యూనిట్లు దాటని వారికి ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తామని 2020-21 వార్షిక బడ్జెట్‌లో ప్రకటించింది. 2,55,677 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున మమతా బెనర్జీకి ఇదే చివరి సారి బడ్జెట్. ఈ బడ్జెట్‌లో సామాజిక రంగం, వెనుకబడిన వర్గాలకు 5,150 కోట్ల రూపాయలు కేటాయించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మమత సర్కార్ జనాకర్షక బడ్జెట్ ప్రవేశపెట్టడం గమనార్హం. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయ ఢంకా మోగించాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మమతా బెనర్జీ అన్ని వర్గాలను ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నంగా ఈ బడ్జెట్ ప్రతిపాదనలను విశే్లషిస్తున్నారు.