జాతీయ వార్తలు

రాహుల్‌ను రాజకీయ పాఠశాలకు పంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, ఫిబ్రవరి 9: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమారుడు రాహుల్‌గాంధీపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నఖ్వీ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాహుల్ గాంధీని ‘పొలిటికల్ ప్లేస్కూల్’కు పంపండి అని సోనియా గాంధీకి సూచించారు. తద్వారా ఆయనలో హుందాతనం, మర్యాదగా మాట్లాడడం అలవడుతుందని పేర్కొన్నారు. దేశంలో రానున్న ఆరు నెలల్లో నిరుద్యోగ సమస్య పరిష్కరించకపోతే ‘దేశ ప్రధాని నరేంద్ర మోదీని కర్రలతో కొడతారు’ అంటూ ఇటీవల రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై నఖ్వీని వివరణ కోరగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ‘‘కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఓ సలహా ఇవ్వదలుచుకొన్నా.. అదేమిటంటే ఆమె కొడుకైన రాహుల్ ‘పప్పు’ను రాజకీయ పాఠశాలకు పంపి రాజకీయాల్లో ఏబీసీడీలను నేర్చుకొమని కోరుతున్నా.. తద్వారా ఆయనలో పరివర్తన, హుందాతనం, మంచిగా మాట్లాడడం అలవాటు అవుతాయి’’ అని నఖ్వీ స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్‌లో ఏ ఒక్కరి మానసిక స్థితి సరిగ్గా లేదు.. అందుకే ప్రజలచే ఎన్నుకోబడిన ఒక ప్రధాన మంత్రిని కర్రలతో కొడతారు అంటూ మాట్లాడుతున్నారు’ అని రాహుల్‌ను ఉద్దేశించి నఖ్వీ విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ సరళిని బట్టి ఎగ్జిట్ పోల్ సర్వేలు చూస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీయే తిరిగి అధికారం చేపడుతుందని తెలుస్తోంది.. దీనిపై మీరేమి అంటారు అని కోరగా ‘దీనిపై నేనేం చెబుతాను.. ఎన్నికల ఫలితాలు రానివ్వండి.. అప్పుడు మాట్లాడదాం’ అని సమాధానం ఇచ్చారు. అయితే, పౌరసత్వ సవరణ చట్టంపై దేశ రాజధాని ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో జరిగిన అల్లర్ల ప్రభావం ఎంతమాత్రం అసెంబ్లీ ఎన్నికలపై లేదని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం, ట్రిపుల్ తలాక్‌పై నిషేధం, జమ్మూ కాశ్మీర్‌లో 370 అధికరణ రద్దు వంటి అంశాలు యావత్ దేశ అభిమతానికి చెందినవే తప్ప కేవలం ఢిల్లీ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైనవి కాదు అని వ్యాఖ్యానించారు. ఈ అంశాలు పార్టీ రాజకీయాలు లేదా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించినవి కాదు అని కేంద్ర మంత్రి నఖ్వీ పేర్కొన్నారు.

*చిత్రం... కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ