జాతీయ వార్తలు

సాయపడేందుకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ప్రాణాంతక కరోనా వైరస్ గుప్పిట చిక్కిన చైనాకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈమేరకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ఓ లేఖ రాశారు. ఈ వైరస్ మహమ్మారిని ఎదుర్కొంటున్న చైనా ప్రభుత్వంతోను, అక్కడి ప్రజలతోనూ సంఘీభావంతో పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఈ లేఖలో మోదీ పేర్కొన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ సవాల్‌ను చైనాతో కలిసి ఎదుర్కొనేందుకు భారత్ ముందుకు వస్తుందని స్పష్టం చేసిన మోదీ ఇప్పటివరకు మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. అలాగే, హూబీ రాష్ట్రం నుంచి 650 మంది భారతీయులను స్వదేశానికి పంపడంలో సహకరించినందుకు చైనా అధ్యక్షుడికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. చైనాలో ఈ వైరస్ తీవ్రం కావడంతో అనేక దేశాలు తమ పౌరులను స్వదేశానికి రప్పించడంతోపాటు వారి కదలికలపైనా చైనాకు సంబంధించిన ఎగుమతులు, దిగుమతులపై కూడా ఆంక్షలు విధించాయి. భారత్ కూడా చైనాకు వెళ్లే లేదా అక్కడి నుంచి వచ్చే వారిపై ముందు జాగ్రత్త చర్యగా అనేక ఆంక్షలు విధించింది. ఇవన్నీ కూడా కొత్త వ్యక్తులకు, కొత్త ప్రాంతాలకు వైరస్ వ్యాప్తిని నిరోధించడానికేనని స్పష్టం చేసింది.