జాతీయ వార్తలు

అంతిమ ఫలితం ఆశ్చర్యకరమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పరిస్థితికి సంబంధించి వచ్చిన ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను కాంగ్రెస్ నాయకత్వం కొట్టి పారేసింది. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు ఉండకపోవచ్చునంటూ ఈ ఫలితాలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే 11న వెల్లడయ్యే అసెంబ్లీ ఫలితాలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయని ఢిల్లీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ముఖేష్ శర్మ అన్నారు. ‘ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలపై వారిని సంబరాలు చేసుకోనివ్వండి, అంతిమ ఫలితం మాత్రం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది’ అని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు శక్తివంచన లేకుండా కృషి చేశారని ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను తాము తిరస్కరిస్తున్నామని ఢిల్లీ కాంగ్రెస్ ప్రతినిధి సుభాష్ చొప్రా అన్నారు. ఈ ఎన్నికల్లో ఆర్‌జేడీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ 66 సీట్లలో అభ్యర్థులను నిలిపింది. 4 స్థానాలను ఆర్‌జేడీకి కేటాయించింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ అత్యుత్తమమైన అభ్యర్థులనే నిలబెట్టామని, ఎంతో నిజాయితీగా ప్రచారం చేశామని ఆయన అన్నారు. తాము కష్టపడ్డాం కాబట్టే ఫలితాలు కూడా సానుకూలంగానే వస్తాయని భావిస్తున్నామన్నారు. 10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉందని సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. అయితే మైనారిటీల ఓట్లు ఎటు పడ్డాయి అనే దానిని బట్టి అంతిమ ఫలితాలు ఉంటాయి. 2015 ఎన్నికల్లో 67.4 శాతం పోలింగ్ నమోదైతే, ఈ సారి 66.59 శాతమే పోలింగ్ జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్‌పోల్స్ అంచనాలన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీదే అధికారం అని స్పష్టం చేశాయి.