జాతీయ వార్తలు

ఆకర్షించిన డిఫెన్స్ ఎక్స్‌పో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 8: దేశ రక్షణ సామర్థ్యానికి, పాటవానికి, సైనిక సత్తాకు అద్దం పట్టే రీతిలో లక్నోలో నిర్వహిస్తున్న డిఫెన్స్ ఎక్స్‌పో ప్రజలను విశేషంగా ఆకర్షించింది. శనివారం నాడు సామాన్య ప్రజలను కూడా ప్రభుత్వం అనుమతించడంతో వేల సంఖ్యలోనే ఈ ప్రాంతానికి ప్రజలు తరలి వచ్చారు. భద్రతా పరంగా గట్టి ఏర్పాట్లు చేసినప్పటికీ, అన్ని రకాలుగానూ తనిఖీలకు సహకరిస్తూ ప్రజలు భారత సైనిక సంపత్తిని వీక్షించారు. అంతిమంగా దీనిని చూసిన ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడిన అలసటను మరిచిపోయి ఓ విజయం సాధించిన ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఉదయం 10 గంటలకు క్యూలో నిలబడిన తనకు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రవేశం లభించిందని తనలాగే వేలాది మంది క్యూలో నిలబడి ఈ ప్రదర్శనను చూశారని సంతోష్ సింగ్ అనే పౌరుడు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌లో భారత సైనిక దళాలకు చెందిన అత్యాధునికమైన వాటిని కూడా ప్రదర్శించడంతో ప్రజల్లో మరింతగా ఆసక్తి పెరిగింది. కేవలం యూపీ జిల్లాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ఈ ప్రదర్శనకు ప్రజలు తరలి వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ ప్రదర్శించే వాటి గురించి ముందస్తుగా జరిగిన ప్రచారం కూడా ప్రజల్లో ఆసక్తిని మరింతగా పెంచింది. భారత్‌ను రక్షణ పరికరాల ఉత్పాదన కేంద్రంగా కూడా ఈ ప్రదర్శన ప్రపంచానికి చాటే అవకాశం ఉండడమే ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడానికి కారణమని మరో పౌరుడు తెలిపారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి జరిగిన ప్రచారం కూడా ఇక్కడి రక్షణ పరికరాలను చూడాలన్న జిజ్ఞాసను ప్రజల్లో పెంచినట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వం కూడా రవాణాపరంగా విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఆదివారం కూడా ఈ ప్రదర్శనను చూసేందుకు ప్రజలను అనుమతించడంతో రేపు మరింత సంఖ్యలోనే జనం తరలి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

*చిత్రం... డిఫెన్స్ ఎక్స్‌పో ప్రాంగణానికి శనివారం తరలి వచ్చిన ప్రజలు