జాతీయ వార్తలు

యడియూరప్పకు అసంతృప్తి సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 8: కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు తలనొప్పిగా మారింది. శాఖల కేటాయింపులో ఆయన తలమునకలయ్యారు. సీనియర్లు మంచి శాఖలను ఆశిస్తున్నారు. కొత్తగా మంత్రివర్గంలో తీసుకున్న వారు తాము ఆశిస్తున్న శాఖల కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 10న (సోమవారం) కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు చేయనున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప శనివారం తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే విధంగా కాంగ్రెస్, జేడీ(ఎస్)కు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గుర్తింపుగా మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అయితే ఇప్పుడు వారికి శాఖల కేటాయింపు ముఖ్యమంత్రి యెడియూరప్పకు సవాల్‌గా మారింది. వారికి శనివారంలోగా శాఖల కేటాయింపు చేయనున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. కాగా శాఖల కేటాయింపులో ముఖ్యమంత్రి యెడియూరప్ప తీవ్ర వత్తిడిని ఎదుర్కొవాల్సి వస్తోంది. దీంతో ఆయన సోమవారానికి శాఖల కేటాయింపును వాయిదా వేశారు. గోకాక్ ఎమ్మెల్యే రమేష్ జార్కిహోళి తనకు నీటి వనరుల అభివృద్ధి శాఖ కావాలని కోరుకుంటున్నట్లు సమాచారం. జార్కిహోళికి ప్రజా పనుల శాఖను కేటాయించాల్సిందిగా పార్టీ నాయకత్వం ముఖ్యమంత్రికి సూచించినట్లు తెలిసింది. జార్కిహోళి శనివారం ఉదయం ముఖ్యమంత్రి యెడియూరప్ప నివాసానికి వెళ్ళి మంతనాలు జరిపారు. అనంతరం జార్కిహోళి అక్కడి నుంచి అసంతృప్తిగా వెళ్ళినట్లు తెలిసింది. మంత్రివర్గంలోకి మరో ఆరుగురిని తీసుకునేందుకు అవకాశం ఉన్నందున, ఆ ఖాళీల భర్తీకి అధిష్టానం అనుమతి కోసం ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయాన్ని విలేఖరులు ప్రశ్నించగా, ప్రస్తుతం తనకు పార్టీ అధిష్టానం వద్దకు వెళ్ళే ఆలోచన ఏదీ లేదన్నారు.
*చిత్రం... కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప