జాతీయ వార్తలు

భారత్ ఎదుగుదలలో యూపీ కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: భారత్ అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడంలో, 2030 నాటికి ప్రపంచంలోని మూడు అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదగడంలో ఉత్తర్‌ప్రదేశ్ ఒక ముఖ్యమయిన పాత్ర పోషిస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. గురువారం నాడిక్కడ ‘డిఫెన్స్ ఎక్స్‌పో’లో ‘ఉత్తర్‌ప్రదేశ్ డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ కారిడార్’పై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘2030 నాటికి భారత్ ప్రపంచంలోని మూడు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంటుం ది. దీనిలో ఉత్తర్‌ప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుంది’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘్భరత్‌ను 2024 నాటికి అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రధాన మంత్రి ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు’ అని ఆయన గుర్తుచేశారు. ప్రపంచంలో మాంద్యం నెలకొని ఉండగా భారత్ ఈ లక్ష్యాన్ని ఎలా ఛేదించగలుగుతుందని కొంత మంది ఆర్థికవేత్తలు అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో మాంద్యం నెలకొని ఉన్నప్పటికీ, భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని ఆయన అన్నారు. ‘ఒక త్రైమాసికంలో వృద్ధిలో తగ్గుదల ఉంటే అదేమంత పెద్ద విషయం కాదు’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రపంచ బ్యాంకు కూడా భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని అంచనా వేసిందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల భారత్ అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే లక్ష్యాన్ని అధిగమిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ తీసుకుంటున్న చర్యల కారణంగా ఉత్తర్‌ప్రదేశ్ ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇందుకుగాను ఆయన యోగి ఆదిత్యనాథ్‌ను అభినందించారు.
*చిత్రం... రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్