జాతీయ వార్తలు

పది మందికి కేబినెట్ పదవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 6: కర్నాటకలో కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి బీజేపీ అధికారంలోకి రావడానికి సహకరించిన 10 మంది ఫిరాయింపు దారులకు ముఖ్యమంత్రి యెడ్యూరప్ప మంత్రి వర్గంలో కేబినెట్ పదవులు లభించాయి.
దీర్ఘకాలంగా వాయిదా పడుతూ వచ్చిన బీజేపీ ప్రభుత్వ మంత్రి వర్గ విస్తరణ జరిగిన మరుక్షణమే బీజేపీ నేతలు కొందరిలో అసంతృప్తి మొదలైంది. ఈ విస్తరణలో పదవులు చేజిక్కించుకోవడానికి ప్రయత్నించిన చాలామంది బీజేపీ నేతలకు తీవ్ర అసంతృప్తే ఎదురైంది. మరోపక్క పార్టీ నాయకత్వం కూడా అసమ్మతి తీవ్రతను తగ్గించేందుకు గట్టి ప్రయత్నాలే చేసింది. అనర్హతకు గురైన కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు అనంతరం బీజేపీకి విధేయతను ప్రకటించి డిసెంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. వారిలో పది మంది చేత రాజ్‌భవన్‌ళో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ విజూభాయ్ వాలా పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఈ తాజా విస్తరణతో యెడ్యూరప్ప కేబినేట్‌లో మంత్రుల సంఖ్య 28కి పెరిగింది. ఇంకా ఆరు ఖాళీలు ఉన్నాయి. స్థానిక బీజేపీ నాయకులను ఈ విస్తరణకు సంబంధించి దూరంగా ఉంచడానికి కారణం మిగతావారిలో అసమ్మతి చెలరేగకుండా చూడడమేనని పేర్కొన్నారు. మొత్తం 16 మంది కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి చెందిన అనర్హ ఎమ్మెల్యేల్లో 10 మందికి మాత్రమే పదవులు లభించడం గమనార్హం. డిసెంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో 13 మంది పోటీ చేస్తే 11 మంది గెలిచారు.
*చిత్రం...కొత్త మంత్రులతో కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప