జాతీయ వార్తలు

‘ఆప్’ వైపు.. ఢిల్లీ చూపు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఢిల్లీ శాసనసభకు ఈనెల ఎనిమిదో తేదీ జరగనున్న ఎన్నికల్లో ఆం ఆద్మీ పార్టీ మరోసారి విజయం సాధించి అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ అనే సంస్థ సర్వేలో పేర్కొంది. ఢిల్లీ శాసనసభలో 70 సీట్లుండగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆం ఆద్మీ పార్టీ దాదాపు 62 నుండి 65 సీట్లు గెలుచుకుంటుందని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. బీజేపీ గత శాసనసభ ఎన్నికల్లో కేవలం మూడు సీట్లు గెలుచుకోగా ఈసారి బీజేపీ సీట్ల సంఖ్య కొద్దిగా పెరగవచ్చని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో ముస్లిం మైనారిటీలు నడి రోడ్డుపై నిర్వహిస్తున్న నిరంతర ధర్నా కార్యక్రమం కారణంగా దేశ రాజధాని ఓటర్లు చీలిపోయి బీజేపీ బలం పెరగవచ్చుననే అభిప్రాయం ఏర్పడటం నిజం కాదని పీపుల్స్ పల్స్ సర్వే తెలిపింది. దేశ రాజధాని ప్రజలు అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంటు ఎన్నికలకు మధ్య తేడా తెలుసుకున్నారని తమ సర్వేలో వెల్లడైందని పీపుల్స్ పల్స్ తెలిపింది. ఐదు కారణాలతో శాసనసభ ఎన్నికల్లో ఆం ఆద్మీ పార్టీ మరోసారి విజయం సాధిస్తుందని సర్వే అభిప్రాయపడింది. ఢిల్లీ ప్రజలు శాసనసభ ఎన్నికల్లో స్థానిక సమస్యలకు ప్రాధాన్యం ఇస్తారు తప్ప జాతీయ అంశాల ఆధారంగా ఓటు వేయటం లేదు. ఆరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో పాఠశాలల అభివృద్ధి, సమర్థ వైద్య సేవలను బాగా మెరుగు పరిచారు, ఇలాంటి పలు కారణాలతో ఆం ఆద్మీ పార్టీ (ఆప్) మళ్లీ గెలుస్తుంది. ఢిల్లీ మొత్తం జనాభాలో దాదాపు 50 శాతం మంది బస్తీలో నివసిస్తారు. కేజ్రీవాల్ ప్రభుత్వం వీరి కోసం ఎంతో చేసింది. ఢిల్లీలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలు, మైనారిటీలు ఆం ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తున్నారన్నారు. ఆం ఆద్మీ పార్టీ ఢిల్లీలోని మురికివాడల్లో నివసించే ప్రజలు, ముస్లింలు, గుజ్జర్లు, వైశ్యులు, పంజాబీలు, జాట్ ఓటర్లను తమవైపు తిప్పుకోవటంలో విజయం సాధించారు. ఆరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీకి అవసరం, నరేంద్ర మోదీ దేశానికి అవసరం అనేది ఢిల్లీ ప్రజల అభిప్రాయం అందుకే ఆం ఆద్మీ పార్టీ మళ్లీ గెలుస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే చెబుతోంది. ఢిల్లీకి చెందిన దాదాపు 25 శాతం వచ్చి, పోయే ఓటర్లు కూడా ఆం ఆద్మీకి మద్దతు ఇస్తున్నట్లు సర్వే సూచిస్తోంది. కాంగ్రెస్ ఓటర్లు కూడా ఇటీవల ఆం ఆద్మీ పార్టీ వైపు ఆకర్షితులయ్యారని సర్వే చెబుతోంది. షాహీన్‌బాగ్ నిరసన మూలంగా బీజేపీకి ఎలాంటి లాభం కలగటం లేదని తమ సర్వేలో తేలినట్లు పీపుల్స్ పల్స్ అభిప్రాయపడింది. ఢిల్లీలోని పూర్వాంచల్ ఓటర్లు, బిహార్ ఓటర్లు బీజేపీకి బదులు ఆం ఆద్మీకి మద్దతు ఇస్తున్నట్లు సర్వేలో తేలిందని పల్స్ తెలిపింది.