జాతీయ వార్తలు

వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం పట్టవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6:దిగజారుతున్న వృద్ధి రేటును నిలబెట్టడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని గురువారం లోక్‌సభలో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా విపక్షాలు తీవ్ర పదజాలంతో దుయ్యబట్టాయి. నిరుద్యోగ సమస్య తీవ్రమవుతున్నా, ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతున్నా కేంద్రానికి ఎంత మాత్రం పట్టడం లేదని ధ్వజమెత్తాయి. ఇటీవల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కనీస పక్షంగానైనా నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడలేదని అన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా వైరస్‌తో సతమతమవుతూంటే..కేంద్ర ప్రభుత్వం మాత్రం జలుబు మందు ఇస్తోందంటూ చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అన్నారు. ఈ దాడిని తిప్పికొట్టిన మాజీ మంత్రి జయంత్ సిన్హా కేంద్ర ప్రభుత్వం పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా దూసుకుపోతూంటే కాంగ్రెస్ మాత్రం తిరోగమన చందంగానే వ్యవహరిస్తోందన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సుదీర్ఘ ప్రసంగాన్ని ఎంతో ఓప్పిగ్గా విన్న 130 కోట్ల మంది భారతీయులకు చివరికి దక్కిందేమీ లేదని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. ప్రజలను ఒప్పించలేక పోతే వారిని గందరగోళంలో పడేయాలన్న లక్ష్యంతోనే కేంద్రం పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోందన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో తన 161 నిముషాల ప్రసంగం ద్వారా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కృతకృత్యమయ్యారన్నారు. మోదీ ప్రభుత్వం వర్తమాన భారతానికి కాషాయ రంగు వేయడమే కాకుండా దాని చరిత్రకు కూడా హిందుత్వ మయంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని డిఎంకె నాయకురాలు కణిమోళి అన్నారు. సింధు లోయ నాగరికతకు సరస్వతి సింధు నాగరికతగా పేరుపెట్టడాన్ని ప్రశ్నించిన కనిమోళి ఈ అంశాన్ని మేధావులకే వదిలేయాలని డిమాండ్ చేశారు.