జాతీయ వార్తలు

చైనా గైర్హాజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: నలభైకి పైగా దేశాలు పాల్గొన్న డిఫెన్స్ ఎక్స్‌పోకు చైనా గైర్హాజరైంది. ఆయుధాల ప్రదర్శనకు సంబంధించిన ఈ ఎక్స్‌పోలో పాల్గొనపోవడానికి తమ దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ ప్రధాన కారణమని చైనా ఒక అధికార ప్రకటనలో పేర్కొంది. కాగా, ఈ ప్రదర్శనలో 172 మిలటరీ ఉత్పత్తుల కంపెనీలు తమ తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. చైనా బృందం కూడా ఇందులో పాల్గొనాల్సి ఉంది. అయితే, కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే 490 మంది మృతి చెందడంతో చైనా హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించింది. మరోవైపు జనవరి 15 తర్వాత చైనాలో ఉన్నవారెవరూ ఇక్కడకు రావడానికి వీల్లేదని, వారి వీసాలు రద్దు చేస్తున్నామని భారత్ చేసిన ప్రకటన కూడా చైనాను ఈ ఎక్స్‌పోకు దూరం చేసింది.

*చిత్రం... భారత సైనికుల యుద్ధ విన్యాసాలు