జాతీయ వార్తలు

కాంగ్రెస్‌కు ఇక మిగిలేదేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: ఝలోక్‌సభ ఎన్నికల అనంతరం వరుస పరాజయాలను చవి చూస్తున్న కాంగ్రెస్‌కు తాజా అయిదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరింత సంకటంగా మారాయి. తాము అధికారంలో ఉన్న అస్సాంను కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి కాంగ్రెస్ చేరుకుందంటూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చాలా స్పష్టంగా వెల్లడించాయి. అదేవిధంగా కేరళలో కూడా ఎల్‌డీ ఎఫ్‌దే అధికారమన్న ఈ ఫలితాలు పార్టీ అధినాయకత్వాన్ని అయోమయంలో పడేశాయి. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో పార్టీని కాపాడుకోవటంతో పాటు రాష్ట్రాల స్థాయిలో కూడా పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం సడలకుండా చేసుకోవడమన్నది కాంగ్రెస్ పార్టీకి సవాలేనని చెప్తున్నారు. ముఖ్యంగా 15 ఏళ్ల పాటు తాము అధికారంలో ఉన్న అస్సాం కూడా చేజారిపోతుందంటున్న సంకేతాలు కాంగ్రెస్ అధినాయకత్వాన్ని అయోమయంలో పడేస్తున్నాయి.
అంచనాల ప్రకారమే ఫలితాలు వచ్చినట్లయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ రాజకీయ ప్రతిష్ట మరింత దెబ్బతింటుందని భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఇప్పటికే రాహుల్ గాంధీ సామర్థ్యం విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దేశంలో కర్ణాటక మినహా పెద్ద రాష్ట్రాలన్నీ కాంగ్రెస్ చేజారిపోయాయి. కాంగ్రెస్ కేవలం ఒకే ఒక పెద్ద రాష్ట్రం కర్నాటకలో అధికారంలో ఉంటుంది, మిగతావన్నీ అతి చిన్న రాష్ట్రాలే. ఉత్తరాఖండ్, మిజోరాం, మణిపూర్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్‌లలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. వీటిలో మూడు ఈశాన్య రాష్ట్రాలే. మొన్నటి వరకూ అధికారంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయటంతో ఆ రాష్ట్రాన్ని బీజేపీ దక్కించుకుంది. ఉత్తరాఖండ్‌లో అధికారం బీజేపీ చిక్కినట్టే చిక్కి కమల తప్పిదాలతో తిరిగి కాంగ్రెస్ చేతిలోకే వచ్చింది. అయినప్పటికీ ఉత్తరాఖండ్, హిమాచల్‌లకు వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగాల్సి ఉంది.
హిమాచల్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదికి ‘చేతి’కి ఎన్ని రాష్ట్రాలు మిగులుతాయన్నది అనుమానమే. కాగా, బీజేపీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అస్సాంలో బి.జె.పి అధికారంలోకి వస్తే దీని ప్రభావం వచ్చే సంవత్సరం జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని నమ్ముతున్నారు. అస్సాం విజయం ప్రధాని నరేంద్ర మోదీని రాజకీయంగా పదిలపరచటంతోపాటు ప్రభుత్వం, పార్టీపై ఆయన పట్టు మళ్లీ పెరుగుతుందని భావిస్తున్నారు. ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓడిన తరువాత పార్టీలో మోదీ ప్రభావం కొంత తగ్గింది. ఇప్పుడా పరిస్థితి మారిపోతుందని అంటున్నారు.