జాతీయ వార్తలు

జైలు వార్డర్ల వ్యాపారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాండిచ్చేరి, జనవరి 22: ఖైదీల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాల్సిన వార్డర్లు అందుకు విరుద్ధంగా ప్రవర్తించి సస్పెన్షన్‌కు గురయ్యారు. పాండిచ్చేరి కేంద్ర కార్యాలయంలో ఖైదీలకు ఫోన్లు అమ్ముతున్న ఏడుగురు వార్డర్లపై పోలీస్ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వారి నుంచి 11 ఫోన్లను సీజ్ చేశారు. ఈ ఫోన్ల నుంచే బాంబు బెదిరింపు కాల్స్ వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. చాలాకాలంగా జరుగుతున్న ఈ తతంగం ఇటీవలే అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో అప్రమత్తమైన సీనియర్ అధికారులు సమాచారాన్ని రాబట్టి, ఏడుగురు వార్డర్లపై చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించారు.