జాతీయ వార్తలు

డ్రైనేజీలో పడిపోయిన మహిళా ఎంపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జామ్‌నగర్ (గుజరాత్), మే 16: ‘మంచికి పోతే చెడు ఎదురుకావడం’ అంటే ఇదేనేమో. తన నియోజకవర్గంలోని ఒక మురికివాడలో ఇళ్లను కూల్చివేస్తున్నారని తెలుసుకుని, హడావిడిగా ఆ ప్రాంతానికి వెళ్లి, అకస్మాత్తుగా పది అడుగుల లోతైన డ్రైనేజీలో పడి ఒక మహిళా ఎంపీ తీవ్ర గాయాల పాలయ్యారు. జామ్‌నగర్‌లోని జాలారామ్ మురికివాడలో ఈ సంఘటన జరిగింది. మురికివాడలోని అక్రమ నిర్మాణాలను జామ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సోమవారం కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. అది తెలుసుకున్న స్థానిక బిజెపి ఎంపీ పూనమ్ మాదమ్ (41) హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కూల్చివేతలు ఆపేందుకు తనవంతు ప్రయత్నంగా స్థానికులు, అధికారులతో మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆమె నిలుచుని వున్న ప్రాంతం కూలిపోయింది. తీరాచూస్తే అది దాదాపు పది అడుగుల లోతున్న ఓ డ్రైనేజీ. ఆమెతోపాటు మరికొందరు కూడా అందులో పడిపోయారు. వెంటనే ఆమెను వెలికితీసి ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమె తలకు తీవ్రగాయమైందని, ఐదు కుట్లు పడ్డాయని, కాళ్లు, భుజాలకు గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ప్రమాదం ఏమీ లేనప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా ఎంపీని ముంబైకి తరలించారు.

చిత్రం డ్రైనేజీలో పడిపోయన ఎంపీని బయటకు తీస్తున్న దృశ్యం