జాతీయ వార్తలు

3 రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో సోమవారం ఎన్నికలు ముగియడంతో మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటమే తరువాయిగా మిగిలింది. 19న ఈ 3 రాష్ట్రాలతోపాటు పశ్చిమ బెంగాల్, అసోంలో ఫలితాలు కూడా తేలనున్నాయ. సోమవారం ఉదయం నుంచి కోట్లాదిగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పటికీ గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలైన ఓట్ల శాతం తక్కువేనని ఎన్నికల కమిషన్ తెలిపింది. తమిళనాడులో అర్ధరాత్రి వరకు 69.1శాతం మేర పోలింగ్ నమోదైంది. మొత్తం 5.82కోట్ల మంది ఓటర్లు భారీగానే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటే మరింతగా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేష్ సిన్హా తెలిపారు. 2011లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 78.12 పోలింగ్ నమోదైందని దానితో పోలిస్తే ఈసారి తక్కువగానే పోలింగ్ జరిగిందని తెలిపారు. ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షం కురిసినా ఓటర్లు ఎంతో ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని, మూడు రాష్ట్రాల్లోనూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలింగ్ జరిగిందని వివరించారు. కేరళల్లో కూడా గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇప్పటివరకూ అందిన వివరాలను బట్టి పోలింగ్ శాతం తక్కువగానే నమోదైందని వెల్లడించారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 75.12శాతం మేర పోలింగ్ నమోదైంది. అలాగే పుదుచ్చేరిలో కూడా 71శాతానికి పైగా పోలింగ్ నమోదైనప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఇది తక్కువేనని వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 75.12శాతం మేర పోలింగ్ నమోదైంది. మూడు రాష్ట్రాల్లోనూ నమోదైన పోలింగ్ వివరాలను ఇంకా సేకరించాల్సి ఉన్నందున తాము వెల్లడించిన పోలింగ్ శాతం కొంత మేర పెరిగే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

చిత్రం తమిళనాడులో సోమవారం జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్న ముఖ్యమంత్రి జయలలిత