జాతీయ వార్తలు

‘స్వచ్ఛ భారత్’కు పెన్షనర్ల సేవలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: భారత్‌ను 2019 అక్టోబర్ నాటికి పూర్తి పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ కార్యక్రమంలో సుమారు 58 లక్షల మంది పింఛనుదారులను భాగస్వాములను చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కేంద్ర సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛనుదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ‘స్వచ్ఛ భారత్ పక్షోత్సవం’లో పాల్గొనాల్సిందిగా కోరుతూ దేశ వ్యాప్తంగా గల అన్ని కేంద్ర ప్రభుత్వ పింఛనుదారుల సంఘాలకు లేఖలు రాసింది. తమ సభ్యులు వారు నివసిస్తున్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేలా చైతన్యం కల్పించాలని అన్ని సంఘాలను ఈ లేఖల్లో కోరింది. ఈ కార్యక్రమం పట్ల ఆసక్తి గలవారు ఏటా వంద గంటలు అంటే వారానికి రెండు గంటలు దీనికోసం కేటాయించాలని సూచించింది. ‘ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి, దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమం ఎంతో కీలకమైనది. ఈ కార్యక్రమం విజయం సాధించాలంటే ఇదో ప్రజా ఉద్యమంగా మారాలి. ఇందుకోసం ప్రజల ఆలోచనా ధోరణిలో స్థిరమైన మార్పు రావాలి’ అని కేంద్రం పింఛనుదారుల సంఘాలకు రాసిన లేఖలో పేర్కొంది. ‘అందువల్ల ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకోవడం, తద్వారా ఇది ఒక ప్రజా ఉద్యమంలా మారడం ఎంతో ముఖ్యం’ అని తెలిపింది. పెద్ద సంఖ్యలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులు సమాజంలో కీలకమైన భాగస్వాములుగా ఉన్నారని పేర్కొంది. ‘మీరు ఎంతో చేయగలరు. వివిధ మార్గాల్లో సమాజాన్ని ఎంతో ప్రభావితం చేయగలరు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, వర్క్‌షాప్‌లను ఏర్పాటు చేయడం, పరిశుభ్రతకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం వంటి స్వచ్ఛతకు సంబంధించిన వివిధ కార్యకలాపాల్లో పాల్గొనవలసిందిగా సూచించడమైనది. అసోసియేషన్లలో, సామాజిక క్లబ్బుల్లో, కాలనీ సంక్షేమ సంఘాలలో పురస్కారాల ప్రదాన కార్యక్రమాలను కూడా నిర్వహించవచ్చు’ అని కేంద్రం లేఖలో పేర్కొంది.