జాతీయ వార్తలు

పది రోజుల్లో నూతన విద్యావిధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: చాలాకాలంగా ఎదురు చూస్తున్న నూతన విద్యావిధానాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం తన రెండేళ్ల కార్యకాలం (మే26) పూర్తి కావటానికి ముందే ప్రకటించబోతోంది. ‘జాతీయ విద్యావిధానం మే 26కు ముందు దేశం ముందుకు రాబోతోంది’ అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ సోమవారం తెలిపారు. ‘దేశ విద్యావిధానం ఎదుర్కొంటున్న సవాళ్లకు నూతన విద్యావిధానం కింద ఎన్‌సీఈఆర్‌టీ పరిష్కారం చూపుతుంది. ఇవాల్టి విద్యార్థులకు పునరుజ్జీవనం గురించి తెలిసినంతగా మహారాణాప్రతాప్ గురించి తెలియదు. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన ‘నో డిటెన్షన్’ విధానం వల్ల తొమ్మిదో తరగతిలో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని రద్దు చేయాలని కోతున్నాయి’ అని ఇరానీ వివరించారు. ‘అందరికీ విద్య’ను సాధించేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని వివరించారు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీ, ఐఐఎంలు, ఎన్‌ఐటీల సహాయంతో ఆన్‌లైన్ విద్యాబోధన అందించనున్నట్లు ఆమె వివరించారు. బోర్డు పరీక్షలకు కూడా ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు గుణాత్మక విద్యను విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా అందిస్తాయని ఆమె చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్, మొబైల్ యాప్‌ను 10 ప్రాంతీయ భాషల్లో రానున్న రెండు మాసాల్లో ప్రారంభించనున్నట్లు ఆమె చెప్పారు. భారతీయ విద్యార్థులంతా ఈ పోర్టల్, యాప్‌ల ద్వారా ఉచితంగా ఎన్‌రోల్ అయితే ఉచితంగా విద్యను పొందవచ్చని.. వారు రాసే పరీక్షలకు మాత్రమే రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్మృతి ఇరానీ తెలిపారు. ‘పాఠశాల విద్యా వ్యవస్థలో గుణాత్మక విద్యను పేదలకు అందించే దిశగా ప్రభుత్వం చేపట్టిన పెద్ద చర్య ఇది. ఎన్‌ఐటీలలో సిలబస్ మార్పునకు సంబంధించి అమెరికాలోని ఎంఐటి, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను కూడా ఆమె ప్రస్తావించారు. ఉపాధ్యాయ శిక్షకులకు ప్రత్యేక కేడర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యావిధానంలో కాషారుూకరణ చేస్తున్నారన్న ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు.